logo

కబడ్డీలో ఒకే ఒక్కడు..!

ఆయనకు కబడ్డీ ప్రాణం.. గురువు నడిపెల్లి సుధాకర్‌రావు(ప్రస్తుతం హైదరాబాద్‌ జిల్లా యువజన క్రీడల అధికారి) వద్ద శిక్షణ పొందారు. అనతి కాలంలోనే మంచి ఆల్‌రౌండర్‌గా పేరు తెచ్చుకున్నారు.

Published : 27 Jan 2023 05:45 IST

ఆలిండియా రెఫరీకి అర్హత
న్యూస్‌టుడే, ఆదిలాబాద్‌ క్రీడావిభాగం

ఇందిరా ప్రియదర్శిని క్రీడా ప్రాంగణంలో కబడ్డీలో శిక్షణ ఇస్తున్న విఠల్‌రెడ్డి

యనకు కబడ్డీ ప్రాణం.. గురువు నడిపెల్లి సుధాకర్‌రావు(ప్రస్తుతం హైదరాబాద్‌ జిల్లా యువజన క్రీడల అధికారి) వద్ద శిక్షణ పొందారు. అనతి కాలంలోనే మంచి ఆల్‌రౌండర్‌గా పేరు తెచ్చుకున్నారు. అదే స్ఫూర్తితో రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో సత్తా చాటారు. తాజాగా ఆలిండియా కబడ్డీ రెఫరీకి అర్హత సాధించారు.. ఆయనే నిరటి విఠల్‌రెడ్డి. ఓ ప్రైవేటు పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఆయన వర్ధమాన క్రీడాకారులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

ఆటలో మెరుపులు..

సౌత్‌జోన్‌ జాతీయస్థాయి కబడ్డీ పోటీల్లో మూడుసార్లు కాకతీయ విశ్వవిద్యాలయం తరఫున ప్రాతినిధ్యం వహించిన ఘనతను సొంతం చేసుకున్నారు.

1997-2000 వరకు సంగారెడ్డిలోని కబడ్డీ స్పోర్ట్స్‌ హాస్టల్‌లో స్పోర్ట్స్‌ ఆఫీసర్‌గా పని చేశారు.

2010లో రాష్ట్రస్థాయి కబడ్డీ రెఫరీకి ఎంపికయ్యారు.

2013లో కబడ్డీలో ఎన్‌ఐఎస్‌(జాతీయ క్రీడా సంస్థ) ఏడాది కోర్సును గుంటూరులో పూర్తి చేశారు.

2023లో జాతీయస్థాయి కబడ్డీ రెఫరీకి అర్హత. రాబోయే కాలంలో ప్రో-కబడ్డీ పోటీలకు రెఫరీగా వ్యవహరించే అవకాశం.

అర్హత సాధించారిలా..

అమెచ్యూర్‌ కబడ్డీ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా వారు గత డిసెంబరు 11న దిల్లీలో రెఫరీ అర్హత పరీక్ష నిర్వహించారు. దేశవ్యాప్తంగా 382 మంది పరీక్ష రాస్తే.. 80 మంది ఉత్తీర్ణులయ్యారు. తెలంగాణ నుంచి ఒకే ఒక్కరుగా నిరటి విఠల్‌రెడ్డి అర్హత సాధించడం గమనార్హం. ఈయన వద్ద శిక్షణ పొందిన అనేక మంది విద్యార్థులు జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. మరికొందరు క్రీడా కోటా కింద ఆర్మీలో, వివిధ ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. క్రీడా విభాగంలో ప్రభుత్వ కొలువు సాధించడమే తన లక్ష్యమంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని