logo

బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి

బడిలో ఉండాల్సిన బాలలతో పనులు చేయిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని అదనపు ఎస్పీ అడ్మిన్‌ అచ్చేశ్వర్‌రావు పేర్కొన్నారు.

Published : 02 Feb 2023 02:22 IST

వివరాలు వెల్లడిస్తున్న అదనపు ఎస్పీ అడ్మిన్‌ అచ్చేశ్వర్‌రావు, చిత్రంలో వివిధ శాఖల అధికారులు

ఆసిఫాబాద్‌, న్యూస్‌టుడే: బడిలో ఉండాల్సిన బాలలతో పనులు చేయిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని అదనపు ఎస్పీ అడ్మిన్‌ అచ్చేశ్వర్‌రావు పేర్కొన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఏఆర్‌ హెడ్‌క్వార్టర్‌ వద్ద ఆపరేషన్‌ స్మైల్‌-09పై నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ప్రత్యేక బృందాలు జనవరి 1 నుంచి 31 వరకు జిల్లాలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించి 43 మంది బాల కార్మికులను గుర్తించామన్నారు. ఆసిఫాబాద్‌ డివిజన్‌లో 21 మంది, కాగజ్‌నగర్‌ డివిజన్‌లో 22 మంది బాలబాలికలను గుర్తించి వారి తల్లిదండ్రులు, పనులకు కుదుర్చుకున్న యజమానులకు అవగాహన కల్పించామన్నారు. పోలీసులు, విద్యా, రెవెన్యూ, కార్మిక శాఖలు, బాలల రక్షణ విభాగం అధికారుల సంయుక్తంగా తనిఖీలు చేపట్టి బాల కార్మికులను గుర్తించారని వివరించారు. బాల కార్మిక వ్యవస్థను ప్రోత్సహిస్తున్న వారిపై కేసులు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బాల కార్మికులను ఎవరైనా గుర్తిస్తే డయల్‌-100 లేదా 1098లో సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ బృంద సభ్యులను అదనపు ఎస్పీ అభినందించారు. కార్యక్రమంలో జిల్లా బాలల సంరక్షణ అధికారి మహేష్‌, టాస్క్‌ఫోర్స్‌ సీఐ సుధాకర్‌, ఆపరేషన్‌ స్మైల్‌ ఆసిఫాబాద్‌ డివిజన్‌ ఇన్‌ఛార్జి ఎస్సై రామన్‌కుమార్‌, కాగజ్‌నగర్‌ డివిజన్‌ ఇన్‌ఛార్జి ఎస్సై ఎం.సర్కార్‌, జిల్లా సంక్షేమ అధికారిణి సావిత్రి, జిల్లా జెండర్‌ సమన్వయకర్త సత్యనారాయణ, జిల్లా లీగల్‌ సర్వీస్‌ సభ్యురాలు సూర్యకళ, షీ టీం ఇన్‌ఛార్జి ఎస్సై రాజేశ్వర్‌, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని