logo

పదోన్నతి కోసం ధ్రువపత్రాల పరిశీలన

ప్రభుత్వ యాజమాన్య పరిధిలో పీజీహెచ్‌ఎంల పదోన్నతి కోసం దరఖాస్తు చేసుకున్న ఉపాధ్యాయుల ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ గురువారం ముగిసింది.

Published : 03 Feb 2023 04:48 IST

పాలనాప్రాంగణం, న్యూస్‌టుడే : ప్రభుత్వ యాజమాన్య పరిధిలో పీజీహెచ్‌ఎంల పదోన్నతి కోసం దరఖాస్తు చేసుకున్న ఉపాధ్యాయుల ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ గురువారం ముగిసింది. ఏడు ఖాళీలకు 19 మంది ఉపాధ్యాయులకు జాబితాలో చోటుదక్కగా.. వారంతా కార్యాలయానికి వచ్చి తమ ధ్రువపత్రాలను పరిశీలన చేయించుకున్నారు.


నేడు బదిలీ దరఖాస్తులు..

జిల్లావ్యాప్తంగా బదిలీ కోసం మొత్తం 1,585 మంది ఉపాధ్యాయులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. వారందరి దరఖాస్తులను శుక్రవారం పరిశీలించనున్నారు. ఇందుకు ఆరు బృందాలను ఏర్పాటుచేశారు. పరిశీలన అనంతరం ఎన్‌టైటిల్‌మెంట్ పాయింట్లతో కూడిన సీనియారిటీ జాబితాను విడుదల చేయనున్నట్లు డీఈవో ప్రణీత తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని