సమాజ హితులు.. సమాచార వారధులు
ఆసక్తితో నేర్చుకున్న కళ ఒకరికి.. సామాజిక సేవ ద్వారా మరొకరికి ఉపాధిని తెచ్చి పెడుతున్నాయి.
చెన్నూరు పట్టణం, భీమారం, న్యూస్‌టుడే: ఆసక్తితో నేర్చుకున్న కళ ఒకరికి.. సామాజిక సేవ ద్వారా మరొకరికి ఉపాధిని తెచ్చి పెడుతున్నాయి. వారిద్దరూ జనానికి ఉపయోగపడే వీడియోలను రూపొందిస్తూ మంచి గుర్తింపు పొందుతున్నారు. యూట్యూబ్‌లో వాటిని పొందుపర్చి శబాష్ అనిపించుకుంటున్నారు చెన్నూరు, భీమారానికి చెందిన యువకులు పెండ్యాల సతీష్, రాపెల్లి రాజన్న యాదవ్. వారిపై కథనం.
యూట్యూబ్ ఛానల్‌లో సతీష్ వీడియోలను వివరించే దృశ్యం
యూట్యూబ్‌లో వీడియోలు పొందుపర్చి..
సతీష్ మిమిక్రీ నేర్చుకొని ప్రావీణ్యం పొందాడు. తనకెంతో ఆసక్తి ఉన్న ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ రంగాలపై పరిజ్ఞానాన్ని పెంచుకొని అందులో రాణిస్తున్నాడు. లాక్‌డౌన్ సమయంలో తాను నేర్చుకున్న పరిజ్ఞానాన్ని మరికొందరు సులువుగా నేర్చుకునేలా వీడియోలను తయారు చేశాడు. యూట్యూబ్‌లో స్వయంగా ఎస్‌ఎం-6టీవీ ఛానల్‌ను రూపొందించి జనానికి ఉపయోగపడే అనేక చిట్కాలతో కూడిన వీడియోలను తయారుచేసి యూట్యూబ్‌లో పొందుపరిచాడు. లాక్‌డౌన్‌లో ప్రభుత్వం సూచించిన నిబంధనల వీడియో, ఆడియోలను రూపొందించి సామాజిక మాధ్యమాల్లో ఏర్పాటుచేసి సామాజిక బాధ్యతను నిర్వర్తించాడు. కరోనా వ్యాప్తిని అరికట్టే శానిటైజర్ తయారు, నీరు, విద్యుత్తు పొదుపు కోసం వాటర్‌ట్యాంకు ఓవర్‌ఫ్లో అలారమ్, చెడిపోయిన ఎల్‌ఈడీ బల్బుల మరమ్మతులు, చరవాణి సిగ్నల్ సమస్యను అధిగమించడంతో పాటు ఇంటిలో విద్యుత్తుకు సంబంధించిన కనీస పరిజ్ఞానాన్ని కల్పించే వీడియోలను తయారుచేసి తన ఛానల్‌లో ఉంచాడు. అతడు యూట్యూబ్‌లో పొందుపర్చిన అనేక వీడియోలను ఇప్పటివరకు లక్షలాదిమంది వీక్షించారు. నేర్చిన కళను పదిమందికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఛానల్ ఆదాయవనరులా మారింది.
సామాజిక బాధ్యత ధ్యేయంగా...
జానపద కళాకారుల కార్యక్రమాన్ని వీడియో తీస్తున్న రాజన్న యాదవ్
గ్రామ యువతను చైతన్యం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న యువకుడు రాపెల్లి రాజన్న యాదవ్ జిల్లాకేంద్రంలోని ఓ ప్రైవేటు కళాశాలలో అధ్యాపకుడు. తెలంగాణలోని మారుమూల ప్రాంతాల వింతలు-విశేషాలు, యువకుల ప్రతిభను తన యూట్యుబ్ ఛానల్, సామాజిక మాధ్యమాల ద్వారా ప్రపంచానికి చాటుతున్నారు. 2018 సంవత్సరంలో కొందరు మిత్రులతో కలిసి ‘గ్రామీణ చైతన్య సేవా సమితి’ని ప్రారంభించారు. దాని ద్వారా గ్రామాల్లోని యువతను సంఘటితం చేసి సమస్యలపై పోరాడేందుకు అండగా నిలిచారు. నిరక్షరాస్యులకు అక్షరాలు నేర్పించడం, వినాయకచవితి సందర్భంగా మట్టి విగ్రహాల పంపిణీ, వేసవిలో చలివేంద్రం, మజ్జిగ పంపిణీ వంటి కార్యక్రమాలను సేవా సమితి ద్వారా చేపట్టాడు. రూరల్ రియలిస్టిక్ యంగిష్ యూత్(ఆర్‌ఆర్‌వై) టాక్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలంగాణలో మరుగునపడిన కళలు, సంప్రదాయాలను వీడియో రూపంలో తెలుపుతున్నారు. యువతకు అవసరమైన ఉద్యోగావకాశాల విషయాలను, పోటీ పరీక్షకు సిద్ధం కావడానికి అవసరమైన వీడియోలను అందుబాటులో ఉంచారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Hyderabad: ఎల్బీనగర్లో అందుబాటులోకి మరో కొత్త ఫ్లైఓవర్
-
India News
Raghav Chadha: రాఘవ్ చద్దా, పరిణీతి డేటింగ్ రూమర్స్.. ఎంపీ సమాధానమిదే..!
-
Sports News
MIW vs UPW: యూపీపై విజయం.. డబ్ల్యూపీఎల్ ఫైనల్లో ముంబయి
-
Crime News
Agra: చిలుక వాంగ్మూలంతో హత్య కేసు నిందితులకు జీవిత ఖైదు!
-
General News
Andhra news: సీఎస్‌తో ఉద్యోగసంఘాల భేటీ.. ప్రభుత్వ ప్రతిపాదనకు అంగీకారం
-
India News
DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపునకు కేబినెట్ ఆమోదం