గురుకులానికి స్వచ్ఛ నజరానా
పట్టణంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకులం స్వచ్ఛ గురుకులంగా రాష్ట్ర స్థాయిలో మెరిసి పురస్కారాన్ని కైవసం చేసుకుంది.
లక్షెట్టిపేట గురుకులంలో గడ్డి తొలగిస్తున్న విద్యార్థులు, సిబ్బంది
లక్షెట్టిపేట, న్యూస్‌టుడే: పట్టణంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకులం స్వచ్ఛ గురుకులంగా రాష్ట్ర స్థాయిలో మెరిసి పురస్కారాన్ని కైవసం చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం, గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో సెప్టెంబర్‌లో రాష్ట్రస్థాయిలో నిర్వహించిన స్వచ్ఛ గురుకుల్-2022 స్పెషల్ డ్రైవ్‌లో 168 గురుకులాల్లో ద్వితీయ స్థానంలో నిలిచి అందరి మన్ననలు పొందింది. నగదు బహుమతిగా రూ. 50 వేలు కైవసం చేసుకోవడం విశేషం. అంతకు ముందు జిల్లా స్థాయిలోనూ మొదటి బహుమతితో రూ.20 వేలు పొందింది. స్వచ్ఛత అవార్డు పొందడంలో గురుకులం ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది చేపట్టిన కార్యక్రమాల గురించి ‘న్యూస్‌టుడే’ కథనం.
చేపట్టిన కార్యక్రమాలివీ..
స్వచ్ఛ గురుకుల్-2022 స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని సెప్టెంబర్ 5 నుంచి 11 వరకు నిర్వహించారు. దీనిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాల్లో చెత్త ఏరివేయడం, పాఠశాల భవనం, డార్మిటరీలు శుభ్ర పర్చడం, మరుగుదొడ్లు, మూత్రశాలలతో పాటు నీటి తొట్టిలను శుభ్రపర్చడంలాంటి కార్యక్రమాలు నిర్వహించారు. వంట గది, భోజన శాలలను శుభ్రపర్చారు. అనంతరం పాఠశాల ఆవరణలో పచ్చదనం కోసం మొక్కలు నాటారు. విద్యార్థుల్లో అవగాహన పెంపొందించడానికి వివిధ రకాల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
ఆనందంగా ఉంది
లలిత కుమారి, ప్రిన్సిపల్, సాంఘిక సంక్షేమ బాలికల గురుకులం, లక్షెట్టిపేట
రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన స్వచ్ఛ గురుకుల్- 2022 పోటీల్లో ద్వితీయ స్థానం కైవసం చేసుకోవడం ఆనందంగా ఉంది. గతంలో జిల్లా స్థాయిలో నిర్వహించిన పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచి రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించాము. విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది సహకారంతోనే అవార్డు సాకారం అయ్యింది. భవిష్యత్తులో ప్రథమ స్థానంలో నిలిచేందుకు కృషి చేస్తాం.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Rishi Sunak: ఇంగ్లాండ్ ఆటగాళ్లతో క్రికెట్ ఆడిన రిషిసునాక్.. వీడియో వైరల్
-
India News
America: అశ్లీల వీడియోలు సరఫరా.. భారతీయుడికి 188 నెలల జైలు..!
-
Movies News
Dasara: ‘దసరా’ సెన్సార్ రిపోర్టు.. మొత్తం ఎన్ని కట్స్ అంటే?
-
India News
Jaishankar: ‘దౌత్యవేత్తలకు భద్రత కల్పించడంలో బ్రిటన్ విఫలం..!’
-
General News
Hyderabad: ఎల్బీనగర్లో అందుబాటులోకి మరో కొత్త ఫ్లైఓవర్
-
India News
Raghav Chadha: రాఘవ్ చద్దా, పరిణీతి డేటింగ్ రూమర్స్.. ఎంపీ సమాధానమిదే..!