logo

ఉపాధ్యాయుల మహాధర్నా

బదిలీలు, పదోన్నతుల సమస్యలపై ఆదివాసీ గిరిజన ఉపాధ్యాయులు కదంతొక్కారు.

Published : 05 Feb 2023 04:23 IST

ఐటీడీఏ ఎదుట నిరసన తెలుపుతున్న ఆదివాసీ గిరిజన ఉపాధ్యాయులు

ఉట్నూరు, న్యూస్‌టుడే : బదిలీలు, పదోన్నతుల సమస్యలపై ఆదివాసీ గిరిజన ఉపాధ్యాయులు కదంతొక్కారు. సుప్రీంకోర్టు తీర్పునకు లోబడి జీవో-3 ప్రకారం ఏజెన్సీ ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ.. ఐకాస ఆధ్వర్యంలో శనివారం ఉట్నూరు ఐటీడీఏ కార్యాలయం ముందు మహాధర్నా నిర్వహించారు. ఐకాస కన్వీనర్‌, కోకన్వీనర్‌ మెస్రం గంగారామ్‌, కపిల్‌ కుమార్‌ జాదవ్‌ మాట్లాడుతూ.. జీవో-03 ప్రకారం ఉద్యోగాలు పొందిన ఏజెన్సీ ఉపాధ్యాయులకు వందశాతం పదోన్నతి కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఏజెన్సీలో పనిచేస్తున్న గిరిజనేతర ఉపాధ్యాయులు ఏజెన్సీని వీడి మైదాన ప్రాంతాలకు బదిలీ కావాలన్నారు. ఐకాస కోకన్వీనర్లు ఏ.తిరుపతి, చంద్రకాంత్‌ జాధవ్‌, గణేష్‌ రాఠోడ్‌, అనక దేవేందర్‌, వెడ్మశ్యాంరావు, కుమ్ర శ్రీనివాస్‌, ఆత్రం సుగుణ, జాదవ్‌ రవీందర్‌, ప్రకాష్‌, దినేష్‌, విశ్వనాథ్‌, లక్ష్మణ్‌, ఆత్మారామ్‌, భీంరావు తదితరులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని