నిధులు రావాలి.. దశ మారాలి
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్‌పై ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. శాసనసభలో ఈ నెల 6న ప్రవేశపెట్టనున్న బడ్జెట్ ఎలా ఉంటుందనే దానిపై ఉమ్మడి జిల్లావాసులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
బడ్జెట్ కేటాయింపులపైనే ఆశలు
న్యూస్‌టుడే, ఆదిలాబాద్ వ్యవసాయం: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్‌పై ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. శాసనసభలో ఈ నెల 6న ప్రవేశపెట్టనున్న బడ్జెట్ ఎలా ఉంటుందనే దానిపై ఉమ్మడి జిల్లావాసులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న రైతుబంధు, రైతుబీమా తదితర పథకాలకు ఏటా బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తున్నారు. ఈ దఫా సాగునీటి ప్రాజెక్టులతో పాటు విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుండటంతో కొత్త ప్రాజెక్టులతో పాటు అసంపూర్తి జలాశయాలు పూర్తి అవుతాయని రైతులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు పూర్తి కాని రుణమాఫీ కింద రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసేందుకు వీలుగా బడ్జెట్‌లో నిధులు కేటాయించే వీలుంది.
ఉమ్మడి జిల్లాలో 16.50 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేస్తారు. వర్షాధారంగానే పండిస్తుండటంతో ఏటా ప్రకృతి విపత్తులతో నష్టపోతున్నారు. ప్రభుత్వం పెట్టుబడి సాయం అందిస్తున్నా.. ధరలు లేక.. దిగుబడి రాక రైతులు నష్టపోతున్నారు. పంటబీమాతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాలకు ప్రాధాన్యం ఇస్తే రైతులకు కొంత మేలు జరిగే అవకాశం ఉంది. జిల్లాలో 15 ప్రాజెక్టులు ఉన్నాయి. వీటిలో కొన్ని అసంపూర్తిగా ఉన్నాయి. మరి కొన్ని నిర్మాణంలో, ఇంకొన్ని ప్రతిపాదనలో ఉన్నాయి.
అనుబంధ రంగాలకు ప్రాధాన్యం
పాడికి పంటకు సంబంధం ఉంది. క్రమంగా పాడి సంపద తగ్గిపోతోంది. పాడి పరిశ్రమలతో పాటు వ్యవసాయ పంట ఉత్పత్తుల పరిశ్రమలను ఏర్పాటుకు నిధులు కేటాయించి ప్రోత్సహిస్తే అన్నదాతలకు మేలు జరుగుతుంది. పంట ఉత్పత్తుల పరిశ్రమలు ఏళ్ల తరబడి ప్రతిపాదనలోనే ఉన్నాయి. రెండో విడత గొర్రెల పంపిణీ కోసం రైతులు తమ వాటా కింద రూ.40 కోట్లు ప్రభుత్వ ఖాతాలో జమ చేశారు. ఉమ్మడి జిల్లా మొత్తంలో ఈ బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తే గొర్రెల పంపిణీ కార్యక్రమం ప్రారంభం అవుతుంది. 19,250 యూనిట్లు మంజూరు చేయాల్సి ఉంది. జిల్లాలోని 450 మత్స్యకార సంఘాలు చేపల విక్రయాలపై ఆధారపడుతున్నారు. ఉచిత చేపలు, రొయ్యల విడుదలకు నిధులు కేటాయిస్తే పథకం సజావుగా జరిగే వీలుంది.
విద్యుత్తు లోటు తీరాలంటే..
ఇటీవల వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు సమస్య తీవ్రం అవుతోంది. 24 గంటలు ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం సరఫరాపై ఆంక్షలు విధిస్తోంది. వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లు, ఉపకేంద్రాల ఏర్పాటు తదితర వాటికి నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంది. నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేసేందుకు రూ.60కోట్లకు పైగా నిధులు మంజూరు కాగా అనేక ఉపకేంద్రాల నిర్మాణాలు పూర్తయ్యాయి.
ఆయిల్‌పామ్ సాగుకు..
ఉమ్మడి జిల్లాలో ఆయిల్‌పామ్ సాగు విస్తీర్ణం పెరగాలంటే బడ్జెట్‌లో రూ.100 కోట్లకు పైగా నిధుల అసవరం ఉంది. గతేడాది 17 వేల ఎకరాల లక్ష్యంతో అధికారులు రైతులను ప్రోత్సహించగా, 5 వేల ఎకరాల్లో సాగైంది. వచ్చే ఏడాది 20 వేల ఎకరాల్లో సాగును పెంచాలి. మొక్కలతో పాటు బిందుసేద్య పరికరాలపై రైతులకు రాయితీ ఇస్తున్నారు. ప్రభుత్వం నిధులు కేటాయిస్తే.. అనుకున్న లక్ష్యానికి చేరుకునే అవకాశం ఉంది.
రైతుబంధు.. రైతు బీమా
రైతుబంధు, రైతుబీమా పథకాలను కొనసాగించాలంటే వానాకాలం, యాసంగి సీజన్లకు కలిపి జిల్లాకు రూ.1684.96 కోట్లు అవసరం. ఉమ్మడి జిల్లా మొత్తంలో 5.81 లక్షల మంది రైతులు రైతుబంధు పథకం కింద లబ్ధి పొందుతున్నారు. ఏటా బడ్జెట్‌లో తప్పనిసరిగా నిధులు కేటాయిస్తున్నారు. రైతుబీమాలో భాగంగా అన్నదాతల పేరున ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తోంది. 2.85 లక్షల మంది రైతులకు రూ.112 కోట్లు అవసరం.
రుణమాఫీ
ఉమ్మడి జిల్లా మొత్తంలో రుణమాఫీ పూర్తిగా చేయాలంటే రూ.1500 కోట్లు అవసరం. కొన్నేళ్లుగా నిధులు లేక చేయడం లేదు. జిల్లాలో రూ.25 వేల లోపు రుణం తీసుకున్న రైతులకు మాఫీ మొత్తాన్ని రైతుల ఖాతాలో జమ చేశారు. మరో రెండు లక్షల మంది ఎదురుచూస్తున్నారు.
ప్రాజెక్టులను పట్టించుకోవాలి..
గతేడాది బడ్జెట్‌లో జిల్లాలోని ప్రాజెక్టులకు కేవలం రూ.450 కోట్లు మాత్రమే కేటాయించారు. కొత్త ప్రాజెక్టులతో పాటు అసంపూర్తి ప్రాజెక్టులకు రూ.2వేల కోట్లు అవసరమని అధికారులు అంచనా వేశారు. జిల్లాలో ఉన్న సాగు భూమిలో అధికారుల లెక్కల ప్రకారం 4.10 లక్షల ఎకరాలకు సాగు నీరందుతుంది. నిలిచిపోయిన ప్రాజెక్టులను పూర్తి చేసి నిర్దేశిత ఆయకట్టుకు నీరందిస్తే రైతులకు మరింత ప్రయోజనం చేకూరుతుంది.
‘మన ఊరు - మన బడి’
‘మన ఊరు - మన బడి’ పథకంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో సకల సౌకర్యాలు సమకూర్చేందుకు ప్రణాళిక రూపొందించింది. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లాలో తొలి విడత 1,032 బడులను ఎంపిక చేసింది. ఇందులో కొన్ని పాఠశాలలకు నిధులు మంజూరు చేయడంతో పాటు పనులు పూర్తి చేసి ఫిబ్రవరి 1న ప్రారంభించారు. మిగిలిన పాఠశాలల్లో ప్రతిపాదించిన పనులు పూర్తి చేయాలంటే వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.336.95 కోట్లు అవసరం.
వైద్య సౌకర్యాలు మెరుగుపర్చాలి
పల్లెకు మెరుగైన వైద్య సేవలందాలంటే 120 కేంద్రాలు మంజూరు చేయడంతో పాటు నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంది. నర్సింగ్ కళాశాల, రేడియాలజీ విభాగం మంజూరు చేశారు. వీటికి సొంత భవనాల నిర్మాణానికి టెండర్లు పూర్తి చేశారు. కేసీఆర్ కిట్లు మంజూరు చేస్తున్నా.. నగదు సాయం అందడం లేదు. నిధుల కొరత లేకుండా పథకానికి నిధులు కేటాయించాలి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
చిన్నారి మోములో చిరునవ్వు కోసం..
-
Ap-top-news News
Vande Bharat Express: 8.30 గంటల్లో సికింద్రాబాద్ నుంచి తిరుపతికి.. వందేభారత్ టైమింగ్స్ ఇలా...
-
India News
Ramayanam: 530 పేజీల బంగారు రామాయణం!
-
Sports News
ఐపీఎల్ పూర్తి షెడ్యూల్.. హైదరాబాద్‌లో మ్యాచ్‌లు ఎప్పుడంటే..
-
Ap-top-news News
జరిమానాల రూపంలో రూ.1.16 కోట్ల వసూళ్లు
-
India News
ఒడిశాలో అరగంట వ్యవధిలో 5,450 పిడుగులు