logo

విహంగాల వీక్షణం మొదలైంది!

కవ్వాల్‌ పులుల సంరక్షణ కేంద్రంలో మొదటి విడత బర్డ్‌వాక్‌ ప్రారంభమైంది. అటవీ కళాశాల నుంచి 15 మంది విద్యార్థులు, హైదరాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ నుంచి మరో 35 మంది పక్షి ప్రేమికులు తమ పేర్లను నమోదు చేయించుకున్నారు.

Published : 05 Feb 2023 04:23 IST

50 మంది పక్షి ప్రేమికుల హాజరు

కవ్వాల్‌ పులుల సంరక్షణ కేంద్రం గురించి ప్రొజెక్టర్‌ ద్వారా వివరిస్తున్న డీసీఎఫ్‌ మాధవరావు

జన్నారం, న్యూస్‌టుడే: కవ్వాల్‌ పులుల సంరక్షణ కేంద్రంలో మొదటి విడత బర్డ్‌వాక్‌ ప్రారంభమైంది. అటవీ కళాశాల నుంచి 15 మంది విద్యార్థులు, హైదరాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ నుంచి మరో 35 మంది పక్షి ప్రేమికులు తమ పేర్లను నమోదు చేయించుకున్నారు. అటవీశాఖ అతిథి గృహం వద్ద వారందరికి ప్రొజెక్టర్‌ ద్వారా కవ్వాల్‌ పులుల సంరక్షణ కేంద్రం గురించి అందులో నివసిస్తున్న వివిధ రకాల పక్షి జాతులపై డిప్యూటీ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ మాధవరావు వివరించారు. మధ్యాహ్న భోజనం అనంతరం వారంతా అటవీశాఖ ఏర్పాటు చేసిన వాహనాల్లో అటవీ ప్రాంతానికి వెళ్లిపోయారు. అక్కడి పక్షులను వీక్షించి రాత్రికి అడవిలోనే బస చేస్తారు. ఆదివారం అడవిలో కలియ తిరిగి సాయంత్రం వరకు తిరిగి వెళ్లిపోతారు. వారి వెంట అటవీశాఖ సిబ్బందిని గైడ్‌గా పంపించినట్లు డీసీఎఫ్‌ తెలిపారు.


కవ్వాల్‌లో కిలకిల రావాల సందడి

జన్నారం: కవ్వాల్‌ పులుల సంరక్షణ కేంద్రంలో పక్షుల కిల కిల రావాలు సందడి చేశాయి. రెండు రోజుల బర్డ్‌వాచ్‌లో భాగంగా.. 50 మంది పక్షి ప్రేమికులు శనివారం అటవీ ప్రాంతంలోని బైసన్‌కుంటకు చేరుకున్నారు. అందుబాటులో ఉన్న బైనాక్యూలర్ల సాయంతో పక్షులను గుర్తించారు. కెమెరాల్లో వాటి చిత్రాలను బంధించారు. అనంతరం గనిశెట్టికుంట, కామన్‌పల్లి వాచ్‌ టవర్‌ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గుడారాల్లో బస చేసేందుకు బయలుదేరి వెళ్లారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని