logo

ఆద్యంతం.. భక్తిభావం

మందమర్రి మండలం బొక్కలగుట్ట గ్రామ శివారు అటవీ ప్రాంతంలోని గాంధారి ఖిల్లా మైసమ్మ జాతర రెండోరోజు శనివారం ఘనంగా కొనసాగింది.

Published : 05 Feb 2023 04:23 IST

కొనసాగుతున్న గాంధారి మైసమ్మ జాతర

గాంధారి మైసమ్మకు నదీ జలాలతో అభిషేకం చేస్తున్న ఆదివాసీలు

రామకృష్ణాపూర్‌, న్యూస్‌టుడే: మందమర్రి మండలం బొక్కలగుట్ట గ్రామ శివారు అటవీ ప్రాంతంలోని గాంధారి ఖిల్లా మైసమ్మ జాతర రెండోరోజు శనివారం ఘనంగా కొనసాగింది. ముందుగా ఆదివాసీ వంశస్థులు సదర్‌ భీమన్న ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గోదావరి జలాలను ఆలయం నుంచి గుట్టపైకి తీసుకువెళ్లారు. పూజారుల మంత్రోచ్చారణల నడుమ దేవతామూర్తులకు అభిషేకం చేశారు. అనంతరం గుట్టకింద ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఆదివాసీలు తప్పడిగుళ్ల, లక్ష్మిదేవర నృత్యాలు చేశారు. మహిళలు కోలాటం ఆడుతూ, సంప్రదాయ నృత్యాలు చేస్తూ అలరించారు. అర్ధరాత్రి దాటాక అమ్మవారికి పట్నాలు, నైవేద్యం సమర్పించారు. వివిధ జిల్లాల నుంచి ఆదివాసీలు పెద్ద ఎత్తున ఇక్కడికి తరలివచ్చారు. జీడికోట వద్ద దర్బార్‌ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.

* జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కల్గకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. మందమర్రి సీఐ ప్రమోద్‌రావు నేతృత్వంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఎస్సై అశోక్‌, ఆదివాసి నాయక్‌పోడ్‌ సేవా సంఘం సభ్యులు, వైస్‌ ఎంపీపీ రాజ్‌కుమార్‌, పంచాయతీ కార్యదర్శి విద్యాలత తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని