logo

పాతవిధానంలో బియ్యం పంపిణీ

రాష్ట్రవ్యాప్తంగా చౌకధరల దుకాణాలకు బియ్యం పంపిణీ మొదలైంది. కొత్త విధానంలో తలెత్తిన సాంకేతిక సమస్యతో బియ్యం పంపిణీ నిలిచిపోయిన వైనంపై ఆదివారం ‘ఈనాడు’ ప్రధాన సంచికలో వార్త ప్రచురితమైన సంగతి తెలిసిందే.

Published : 06 Feb 2023 04:48 IST

ఆదిలాబాద్‌ కలెక్టరేట్, న్యూస్‌టుడే : రాష్ట్రవ్యాప్తంగా చౌకధరల దుకాణాలకు బియ్యం పంపిణీ మొదలైంది. కొత్త విధానంలో తలెత్తిన సాంకేతిక సమస్యతో బియ్యం పంపిణీ నిలిచిపోయిన వైనంపై ఆదివారం ‘ఈనాడు’ ప్రధాన సంచికలో వార్త ప్రచురితమైన సంగతి తెలిసిందే. ఈ సమస్య కారణంగా కార్డుదారులకు బియ్యం పంపిణీ ఆలస్యం కానుందని ఆ కథనంలో ప్రస్తావించడంతో పౌర సరఫరాల సంస్థ ఎండీ అనిల్‌కుమార్‌ స్పందించారు. మండలస్థాయి నిల్వ కేంద్రాల నుంచి ఇది వరకు అమల్లో ఉన్న పాత విధానంలోనే బియ్యం చౌకధర దుకాణాలకు పంపించాలని మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. కార్డుదారులకు ఈ నెల 8వ తేదీ నుంచి బియ్యం పంపిణీ ప్రారంభించాలని సూచించారు. ఈ విషయాన్ని ఆదిలాబాద్‌ జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజరు సుధారాణి, పౌర సరఫరాల అధికారి టి.కిరణ్‌కుమార్‌ ధ్రువీకరించారు. తాజా ఆదేశాలతో ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల నుంచి బియ్యం పంపిణీ మొదలైంది. ఇదిలా ఉంటే వచ్చే నెల కోటా నుంచి బియ్యం తీసుకునే సమయంలో డీలర్ల నుంచి వేలిముద్రలు తీసుకోవాలని నిర్ణయించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని