logo

జాతీయస్థాయి ‘జూడో’ పోటీల్లో పతకాల పంట

కేరళలోని త్రిస్సుర్‌లో జరుగుతున్న ఖేలో ఇండియా 2వ జాతీయస్థాయి మహిళల జూడో ఛాంపియన్‌షిప్‌ లీగ్‌ పోటీల్లో ఆదిలాబాద్‌ క్రీడా పాఠశాలకు చెందిన బాలికలు సత్తా చాటి పతకాల పంటను పండించారు.

Published : 06 Feb 2023 05:17 IST

సత్తా చాటిన ఆదిలాబాద్‌ క్రీడా పాఠశాల బాలికలు

కప్‌, పతకాలతో ఆదిలాబాద్‌ క్రీడా పాఠశాల బాలికలు

ఆదిలాబాద్‌ క్రీడావిభాగం, న్యూస్‌టుడే : కేరళలోని త్రిస్సుర్‌లో జరుగుతున్న ఖేలో ఇండియా 2వ జాతీయస్థాయి మహిళల జూడో ఛాంపియన్‌షిప్‌ లీగ్‌ పోటీల్లో ఆదిలాబాద్‌ క్రీడా పాఠశాలకు చెందిన బాలికలు సత్తా చాటి పతకాల పంటను పండించారు. తెలంగాణ జట్టును ద్వితీయ స్థానంలో నిలిపారు. ఆదివారం ఉదయం జరిగిన పోటీల్లో 8 పతకాలు (2 పసిడి, 3 రజతాలు, 3 కాంస్యం) సాధించారు. జె.మధులత(48 కిలోలు), ఎస్‌.రమ్య(52 కిలోలు) పసిడి, సునీత(44 కిలోలు), ఎన్‌.శ్రీజ(70 కిలోలు), అలేఖ్య(57 కిలోలు) రజతాలు, సహస్ర(40 కిలోలు), ఆర్‌.చాందిని(57 కిలోలు), జె.అభినయ(40 కిలోలు) కాంస్య పతకాలు గెలిచారని జూడో శిక్షకుడు నంగనూరి రాజు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని