logo

మైసమ్మకు బోనాలు.. కాళభైరవుడికి మొక్కులు

మందమర్రి మండలం బొక్కలగుట్ట గ్రామ శివారు అటవీ ప్రాంతంలోని గాంధారి ఖిల్లా మైసమ్మ జాతర ఆదివారం ఘనంగా జరిగింది. జాతరకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలిరావడంతో గాంధారిఖిల్లాపై సందడి నెలకొంది.

Published : 06 Feb 2023 05:17 IST

కాళభైరవుడిని దర్శించుకుంటున్న మంచిర్యాల జడ్పీ ఛైర్‌పర్సన్‌ భాగ్యలక్ష్మి; ఐటీడీఓ ఏపీఓ రాంబాబు

రామకృష్ణాపూర్‌, న్యూస్‌టుడే: మందమర్రి మండలం బొక్కలగుట్ట గ్రామ శివారు అటవీ ప్రాంతంలోని గాంధారి ఖిల్లా మైసమ్మ జాతర ఆదివారం ఘనంగా జరిగింది. జాతరకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలిరావడంతో గాంధారిఖిల్లాపై సందడి నెలకొంది. మధ్యాహ్నం వరకు భక్తుల సంఖ్య తక్కువగా ఉండగా ఆ తర్వాత క్రమంగా పెరిగింది. భక్తులు, ఆదివాసీ, నాయక్‌పోడ్‌ కుటుంబ సభ్యులు ఖిల్లాలోని దర్వాజ వద్ద గాంధారి మైసమ్మతో పాటు కాళభైరవుడు, నాగదేవత తదితర చోట్ల ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. మంచిర్యాల జడ్పీ ఛైర్‌పర్సన్‌ నల్లాల భాగ్యలక్ష్మితోపాటు ఐటీడీఓ ఏపీఓ రాంబాబు, క్యాతనపల్లి పుర కౌన్సిలర్లు మైసమ్మతో పాటు కాళభైరవుడికి పూజలు చేశారు.

ఆదివాసీల సంప్రదాయ కార్యక్రమాలు

ఆదివాసీలు తమ సంస్కృతి, సంప్రదాయాలతో చేసిన సాంస్కృతిక నృత్యాలు అలరించాయి. తప్పెటగుళ్లు, కోలాటం, లక్ష్మీదేవర వంటి సంప్రదాయ నృత్యాలను భక్తులు ఆసక్తిగా తిలకించారు. అనంతరం దర్బార్‌ నిర్వహించారు. మంచిర్యాల ఏసీపీ తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో సీఐ ప్రమోద్‌రావు నేతృత్వంలో ఎస్సై అశోక్‌ బందోబస్తు చేపట్టారు. భక్తుల కోసం వైద్యఆరోగ్యశాఖ అధికారులు శిబిరం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో క్యాతనపల్లి వైస్‌ ఛైర్మన్‌ సాగర్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ రాజ్‌కుమార్‌, కౌన్సిలర్లు తిరుపతి, అనిల్‌రావు, ఓదెలు, శ్రీనివాస్‌, పంచాయతి కార్యదర్శి విద్యాలత తదితరులున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని