logo

జనసంద్రం.. శ్రీరాముల గుట్ట ఆలయం

శ్రీరాముల గుట్టపై మూడు రోజుల కిందట ప్రారంభమైన జాతర ఆదివారంతో ముగిసింది. చివరి రోజు జిల్లా నలుమూలల నుంచే కాకుండా మహారాష్ట్ర నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో శ్రీరాములగుట్ట పరిసరాలు జనసంద్రంగా మారాయి.

Updated : 06 Feb 2023 05:49 IST

శ్రీసీతారాముల కల్యాణం నిర్వహిస్తున్న వేదపండితులు

తాంసి, న్యూస్‌టుడే : శ్రీరాముల గుట్టపై మూడు రోజుల కిందట ప్రారంభమైన జాతర ఆదివారంతో ముగిసింది. చివరి రోజు జిల్లా నలుమూలల నుంచే కాకుండా మహారాష్ట్ర నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో శ్రీరాములగుట్ట పరిసరాలు జనసంద్రంగా మారాయి. భక్తులకు ఇబ్బందులు కలగకుండా తాంసి, భీంపూర్‌, తలమడుగు, ఆదిలాబాద్‌ గ్రామీణ పోలీసు స్టేషన్‌లకు సంబంధించిన పోలీసు సిబ్బంది సీఐ రఘుపతి పర్యవేక్షణలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఉదయం ఆలయ కమిటీ సభ్యులు పట్టు వస్త్రాలు, తాళిబొట్టు, మెట్టెలు అందించగా,  వేదపండితుల కల్యాణం జరిపించారు. సాయంత్రం పూలతో అలంకరించిన రథంలో ఉత్సవ విగ్రహాలను ఉంచి, శోభాయాత్ర నిర్వహించారు. భక్తులు గుట్టపైకి ఎక్కడానికి ఇబ్బందిపడ్డారు. అన్నదానం చేశారు. ఆలయ కమిటీ సభ్యులు శ్రీనివాస్‌గౌడ్‌, లింగారెడ్డి, వీరయ్య, ఎంపీపీ మంజుల, జడ్పీటీసీ సభ్యుడు తాటిపెల్లి రాజు, సర్పంచులు కృష్ణ, శంకర్‌, సదానందం, కేశవ్‌రెడ్డి తదితరులున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని