logo

‘నూతన విద్యా విధానాన్ని సవరించాలి’

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానం లోపభూయిష్టంగా ఉందని, దీన్ని సవరించాల్సిన అవసరం ఉందని ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, పార్లమెంటు మాజీ ఎంపీ మిడియం బాబురావు అభిప్రాయపడ్డారు.

Published : 06 Feb 2023 05:17 IST

సదస్సులో ప్రసంగిస్తున్న ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మిడియం బాబురావు

ఎదులాపురం, న్యూస్‌టుడే : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానం లోపభూయిష్టంగా ఉందని, దీన్ని సవరించాల్సిన అవసరం ఉందని ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, పార్లమెంటు మాజీ ఎంపీ మిడియం బాబురావు అభిప్రాయపడ్డారు. మూఢత్వాన్ని విడనాడి విజ్ఞానాన్ని పెంచేలా, విద్యార్థులపై మానసిక ఒత్తిడి లేకుండా ఉండాల్సిన ఈ విధానం ఉండాల్సి ఉండగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానం దీనికి విరుద్ధంగా విద్యార్థులను చదువులకు దూరంగా చేసేలా ఉందని విమర్శించారు. స్థానిక ఆర్‌ అండ్‌ బీ అతిథి గృహ మైదానంలో ఆదివారం తెలంగాణ ఆదివాసీ విద్యార్థి సంఘం, తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆదివాసీ విద్యా, వైజ్ఞానికి సాంస్కృతిక సంబురాల సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన నూతన విద్యా విధానాన్ని తీవ్రంగా ఖండించారు. కార్యక్రమంలో పాల్గొన్న టీఏజీఎస్‌ రాష్ట్ర కార్యదర్శి తొడసం భీంరావు, ఉపాధ్యక్షులు బండారు రవికుమార్‌, సరియం కోటేశ్వర్‌రావు, టీఏవీఎస్‌ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు మెస్రం రాజు, పూసం సచిన్‌, నాయకులు దర్శనాల మల్లేష్‌, లంక రాఘవులు, బండి దత్తాత్రి, అన్నమొల్ల కిరణ్‌లు మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలు పరిష్కరిస్తూ వారికి చదువులపై ఆసక్తి కలిగేలా విద్యా విధానం ఉండాల్సి ఉండగా ప్రభుత్వం దాన్ని విస్మరించి వారిని చదువుకు దూరంగా చేసేలా ఉందని ఆరోపించారు. ఆదివాసీ సంస్కృతిని ప్రతిబింబించేలా సాంస్కృతిక కార్యక్రమాలు, గుస్సాడీ నృత్య ప్రదర్శనలు ఆహుతులను అలరించాయి. సదస్సులో నాయకులు ఆత్రం తానూష్‌, మేస్రం నర్మద, కొట్నక్‌ పుష్పలత, మాలశ్రీ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు