logo

డ్రైవర్‌కు ఛాతీలో నొప్పి.. ఆర్టీసీ బస్సు బోల్తా.

జిల్లా కేంద్రంలోని చెక్‌ పోస్టు సమీపంలో జాతీయ రహదారిపై  ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. 

Updated : 06 Feb 2023 14:57 IST

ఆసిఫాబాద్‌: కుమురం భీం జిల్లా కేంద్రం ఆసిఫాబాద్‌లో ఆర్టీసీ బస్సు బోల్తాపడింది. డ్రైవర్‌కు ఛాతీలో నొప్పి రావడంతో చెక్‌పోస్టు వద్ద హైవేపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం ఉదయం ఆసిఫాబాద్‌ డిపో నుంచి హైదరాబాద్‌కు ఆర్టీసీ సూపర్‌ లగ్జరీ బస్సు బయల్దేరింది. బస్సు కిలోమీటర్‌ దూరం వెళ్లగానే డ్రైవర్‌ సతీశ్‌కు ఛాతీలో నొప్పి రావడంతో స్టీరింగ్‌ను వదిలి ఆయన కిందపడిపోయారు. దీంతో బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న గోతిలోకి దూసుకెళ్లి బోల్తాపడింది. ఆ సమయంలో బస్సులో డ్రైవర్‌, కండక్టర్‌తో పాటు మరో ఇద్దరు ఆర్టీసీ సిబ్బంది, మరో ముగ్గురు ప్రయాణికులు ఉన్నారు. ఒక్కసారిగా బస్సు బోల్తా పడటంతో కండర్‌ శ్రీనివాస్‌ సహా ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. డ్రైవర్‌, కండక్టర్లను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మంచిర్యాల తరలించారు. ఈ ప్రమాదంలో బస్సులోని ఓ ప్రయాణికురాలికి స్వల్ప గాయమైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని