logo

ఎల్‌ఏడీసీసీ సేవలతో పేదలకు ప్రయోజనం

న్యాయ సహాయ మండలి(ఎల్‌ఏడీసీసీ) ద్వారా పేదలకెంతో ప్రయోజనం కలుగుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంఆర్‌ సునీత పేర్కొన్నారు.

Published : 07 Feb 2023 06:32 IST

హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌ ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారంలో వింటున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి
ఎంఆర్‌ సునీత, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎన్రాల నగేష్‌, ఇతర న్యాయమూర్తులు

ఎదులాపురం, న్యూస్‌టుడే: న్యాయ సహాయ మండలి(ఎల్‌ఏడీసీసీ) ద్వారా పేదలకెంతో ప్రయోజనం కలుగుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంఆర్‌ సునీత పేర్కొన్నారు. హైకోర్టు నూతనంగా ప్రవేశ పెట్టిన ఈ విధానంలో సోమవారం హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌ రాష్ట్రంలోని పదహారు చోట్ల వర్చువల్‌ విధానంలో ఈ భవనాలను ప్రారంభించారు. ఇందులో భాగంగా ఆదిలాబాద్‌ కోర్టు ఆవరణలో నిర్మించిన ఎల్‌ఏడీసీసీ భవనానికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంఆర్‌ సునీత రిబ్బను కత్తిరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా న్యాయ సహాయ మండలి న్యాయవాదులుగా దాసరి గంగారాం, అరుగుల అశోక్‌, ఉమేష్‌ డోలే బాధ్యతలు చేపట్టారు. పేదరికం కారణంగా ఇబ్బందులు పడేవారికి న్యాయ సహాయం, సలహాలు ఈ మండలి న్యాయవాదులు అందించనున్నారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు ప్రమీల జైన్‌, క్షమా దేశ్‌పాండె(డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి), మంజుల సూర్యవార్‌, యశ్వంత్‌సింగ్‌ చౌహాన్‌, వినియోగదారుల ఫోరం అధ్యక్షుడు జాబేజ్‌ శామ్యుల్‌ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎన్రాల నగేష్‌, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని