logo

మయన్మార్‌ అమ్మాయి.. చింతగూడ అబ్బాయి

మయన్మార్‌ దేశానికి చెందిన ఓ యువతి గుడిహత్నూర్‌ మండలంలోని చింతగూడ గ్రామానికి చెందిన యువకుడి మధ్య చిగురించిన ప్రేమ ఎల్లలు దాటింది.

Published : 07 Feb 2023 06:42 IST

ఎల్లలు దాటిన ప్రేమ

చర్చిలో ఉంగరాలు మార్చుకుంటున్న దంపతులు

గుడిహత్నూర్‌, న్యూస్‌టుడే: మయన్మార్‌ దేశానికి చెందిన ఓ యువతి గుడిహత్నూర్‌ మండలంలోని చింతగూడ గ్రామానికి చెందిన యువకుడి మధ్య చిగురించిన ప్రేమ ఎల్లలు దాటింది. వారి ప్రేమను పెద్దలు అంగీకరించడంతో.. సోమవారం మండలంలోని చింతగూడ చర్చిలో గ్రామస్థుల సమక్షంలో వివాహం జరిగింది. మయన్మార్‌ యువతి జిన్‌నెహు థియేన్‌(క్యాథరిన్‌) చింతగూడకు చెందిన రవికుమార్‌ ఖతర్‌ దేశంలో హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు చేసి అక్కడే ఉద్యోగాలు చేస్తున్నారు. ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఈ విషయాన్ని రవికుమార్‌ తమ తల్లిదండ్రులకు తెలపడంతో వారు పెళ్లికి ఒప్పుకొన్నారు. 20 రోజుల కిందట ఇద్దరూ గ్రామానికి రాగా.. చర్చిలో సంప్రదాయబద్ధంగా వివాహం జరిగింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని