logo

అగ్నిపథ్‌కు ఎంపిక కాలేదని.. యువకుడి బలవన్మరణం

ఆర్మీలో చేరాలనేది ఆ యువకుడి కల.. దానికోసం శ్రమించినా ఫలితం దక్కకపోవడంతో చావే దిక్కనుకున్నాడు.

Published : 07 Feb 2023 06:45 IST

కార్తీక్‌

తాంసి, న్యూస్‌టుడే: ఆర్మీలో చేరాలనేది ఆ యువకుడి కల.. దానికోసం శ్రమించినా ఫలితం దక్కకపోవడంతో చావే దిక్కనుకున్నాడు. పురుగుమందు తాగి తనువు చాలించి ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపిన ఘటన తాంసి మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కప్పర్ల గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ చౌదరి మోహన్‌-లలిత దంపతులకు కుమారుడు కార్తీక్‌(22), కూతురు శిరీష. డిగ్రీ వరకు చదివిన కార్తీక్‌ ఆర్మీలో చేరి దేశ సేవ చేయాలని కలలు కన్నాడు. నిత్యం వ్యాయామం చేస్తూ ఉద్యోగం కోసం శ్రమించాడు. గతంలో ఆర్మీకి ఇటీవల అగ్నిపథ్‌కు ఎంపికకాకపోవడంతో జీవితంపై విరక్తి చెంది, సోమవారం సాయంత్రం గ్రామ సమీపంలోని వ్యవసాయ పొలంలో పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సాగు పనులు చేసి ఇంటికి తిరిగి వస్తున్న కూలీలు అతన్ని గమనించి గ్రామస్థులకు సమాచారమిచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని, శవపంచనామా తర్వాత పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని రిమ్స్‌కు తరలించారు. మృతుడి తండ్రి మోహన్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ కేశవ్‌ స్వామి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని