logo

ఇక రేషన్‌ దుకాణాల్లో ఆధార్‌ నవీకరణ

ఆధార్‌ కార్డు నవీకరణ(అప్‌డేషన్‌) తప్పనిసరి కావడంతో ప్రజల చెంతకే వెళ్లి ఆ ప్రక్రియను పూర్తి చేసేలా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది.

Published : 11 Mar 2023 05:55 IST

గుడిహత్నూర్‌లో కార్డుదారుకు ఆధార్‌ అప్‌డేట్ చేస్తున్న మీ సేవ కేంద్ర నిర్వాహకురాలు స్మిత

పాలనాప్రాంగణం, న్యూస్‌టుడే : ఆధార్‌ కార్డు నవీకరణ(అప్‌డేషన్‌) తప్పనిసరి కావడంతో ప్రజల చెంతకే వెళ్లి ఆ ప్రక్రియను పూర్తి చేసేలా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా చౌకధరల(రేషన్‌) దుకాణాలకు వచ్చే కార్డుదారులే లక్ష్యంగా నవీకరణకు శ్రీకారం చుట్టింది. జిల్లాలో గుడిహత్నూర్‌, ఇంద్రవెల్లి, గాదిగూడ, బోథ్‌ మండల కేంద్రాల్లో శుక్రవారం కార్డుదారుల నుంచి ఆయా పత్రాలను చూసి వారి ఆధార్‌ నవీకరించారు. రేషన్‌ దుకాణాలకు వచ్చేది పేదలే కావడం.. అందునా మారుమూల మండలాలతో పాటు అధికంగా కార్డుదారులు వచ్చే దుకాణాలను ఎంచుకున్నారు. ప్రస్తుతం అక్కడికి మీసేవ, ఆధార్‌ నమోదు, సీఎస్‌సీ కేంద్రాల నిర్వాహకులు వెళ్లి ఈ ప్రక్రియను కొనసాగిస్తున్నారు. రానున్న రోజుల్లో డీలర్లకే నవీకరణ చేసే వెసులుబాటు కల్పిస్తారని జిల్లా పౌర సరఫరాల అధికారి కిరణ్‌కుమార్‌ తెలిపారు. రేషన్‌ దుకాణాల్లో ఆధార్‌ నవీకరణ జరుగుతోన్న విషయమై విస్తృత ప్రచారం చేయాలని, కార్డుదారులు ఆధార్‌ నవీకరణ సమయంలో కార్డులో మార్పులకు సంబంధించి తగు ఆధార పత్రాలను వెంట తీసుకెళ్లాలని మీసేవ కేంద్రాల పర్యవేక్షకులు బండి రవి సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని