logo

ఫ్యాను తగిలి విద్యార్థినికి తీవ్రగాయాలు

నేరడిగొండ మండలం లఖంపూర్‌ బాలికల ఆశ్రమోన్నత పాఠశాల విద్యార్థిని దీపికకు ఫ్యాను తగిలి గాయాలైనట్లు పాఠశాల సిబ్బంది తెలిపారు.

Published : 23 Mar 2023 05:56 IST

గాయపడిన దీపిక

నేరడిగొండ, న్యూస్‌టుడే : నేరడిగొండ మండలం లఖంపూర్‌ బాలికల ఆశ్రమోన్నత పాఠశాల విద్యార్థిని దీపికకు ఫ్యాను తగిలి గాయాలైనట్లు పాఠశాల సిబ్బంది తెలిపారు. బుధవారం ఉదయం అల్పాహారం తిని గదిలోని పైబెర్తులో పడుకుంది. మధ్యాహ్న భోజనం చేసేందుకు నిద్రలోంచి మేల్కొన్న దీపిక గాబరాగా నిలబడగానే పైనున్న ఫ్యాను తగిలి తల, ముక్కు భాగంలో గాయాలయ్యాయి. గమనించిన పాఠశాల సిబ్బంది ప్రైవేటు వాహనంలో నేరడిగొండ పీహెచ్‌సీకి తరలించారు. అనôతరం ఆదిలాబాë్ రిమ్స్‌ ఆసుపత్రికి  తరలించినట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని