logo

సరస్వతీ క్షేత్ర పునర్నిర్మాణ పనులకు అంకురార్పణ నేడు

నిర్మల్‌ జిల్లా బాసర సరస్వతీ ఆలయ పునర్నిర్మాణ పనులకు శృంగేరి పిఠాధిపతి ఈనెల 24న అనుమతి ఇవ్వడంతో  ముహూర్తం ఖరారైందని ఆలయ ఈఓ విజయరామారావు, స్థానచార్యులు ప్రవీణ్‌కుమార్‌, ఆలయ ఛైర్మన్‌ శరత్‌పాఠక్‌లు పేర్కొన్నారు.

Published : 24 Mar 2023 02:58 IST

వివరాలను వెల్లడిస్తున్న ఈఓ విజయరామారావు

ముథోల్‌(బాసర), న్యూస్‌టుడే: నిర్మల్‌ జిల్లా బాసర సరస్వతీ ఆలయ పునర్నిర్మాణ పనులకు శృంగేరి పిఠాధిపతి ఈనెల 24న అనుమతి ఇవ్వడంతో  ముహూర్తం ఖరారైందని ఆలయ ఈఓ విజయరామారావు, స్థానచార్యులు ప్రవీణ్‌కుమార్‌, ఆలయ ఛైర్మన్‌ శరత్‌పాఠక్‌లు పేర్కొన్నారు. గురువారం బాసర ఆలయంలోని వేములవాడ అతిథిగృహంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. శుక్రవారం అమ్మవారికి వేదపండితులు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, రాష్ట్ర నీటి పారుదలశాఖ చైర్మన్‌ వేణుగోపాలచారిలు ప్రత్యేక పూజలు చేసి ఆలయ పునర్నిర్మాణ పనులు ప్రారంభించనున్నారు.

రూ.100 కోట్లతో పనులు...

ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్యే విఠల్‌రెడ్డిల ప్రత్యేక చొరవతో బాసర ఆలయ పునర్నిర్మాణ పనులకు ఇప్పటికే రూ. వంద కోట్లు మంజూరయ్యాయి. అందులోంచి ప్రభుత్వం రూ.50 కోట్లను విడుదల చేయగా అందులోంచి రూ.8 కోట్లతో ఆలయంలో షెడ్డు, గదుల నిర్మాణ పనులను చేపట్టారు. మిగిలిన నిధులతో పాటు మరో రూ.50 కోట్లతో పనులను చేయనున్నారు. టెండర్లు ఆలస్యం జరిగిన పనులు ఆగవని అధికారులు చెబుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని