logo

పోటాపోటీగా శోభాయాత్రలు

శ్రీరామనవమిని పురస్కరించుకొని ఆదిలాబాద్‌ పట్టణంలో జోగు యువసేన, హిందూ ధార్మిక సంస్థల ఆధ్వర్యంలో గురువారం పోటాపోటీగా భారీ ఎత్తున శోభాయాత్రలు నిర్వహించారు

Published : 31 Mar 2023 05:50 IST

 ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు

శ్రీరామనవమిని పురస్కరించుకొని ఆదిలాబాద్‌ పట్టణంలో జోగు యువసేన, హిందూ ధార్మిక సంస్థల ఆధ్వర్యంలో గురువారం పోటాపోటీగా భారీ ఎత్తున శోభాయాత్రలు నిర్వహించారు. రాముడి విగ్రహాలతో పట్టణంలో ఊరేగింపు చేపట్టారు. తెరాస, జోగు యువ సేన ఆధ్వర్యంలో ఎమ్మెల్యే జోగురామన్న, డీసీసీబీ ఛైర్మన్‌ అడ్డి భోజారెడ్డి, భారాస పట్టణ అధ్యక్షుడు అజయ్‌, ఎమ్మెల్యే తనయుడు మహేందర్‌, భారాస నాయకులు, కౌన్సిలర్లు ఆడిపాడారు. శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠం ప్రాంగణంలో మఠాధిపతి యోగానంద సరస్వతి రామ రథానికి పూజలు చేశారు. భాజపా జిల్లా అధ్యక్షుడు పాయల్‌ శంకర్‌, నాయకుడు కంది శ్రీనివాస్‌రెడ్డి, శ్రీరామ నవమి ఉత్సవ సమితి అధ్యక్షుడు మహేందర్‌, హిందూ ధార్మిక సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. యువకులు హనుమాన్‌ చాలీసాను ఆలపించడంతో వినాయక్‌ కూడలి మార్మోగింది. జడ్పీ మాజీ ఛైర్‌పర్సన్‌ సుహాసినిరెడ్డి, హిందూ వాహిని ఉపాధ్యక్షుడు చాణక్య, సభ్యులు శ్రీనివాస్‌, సాయికిరణ్‌, సాయికృష్ణ పాల్గొన్నారు. ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. జిల్లా అంతటా కల్యాణోత్సవం కనులపండువగా సాగింది.
న్యూస్‌టుడే, ఆదిలాబాద్‌ పట్టణం,ఆదిలాబాద్‌ సాంస్కృతికం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు