logo

నాలుగేళ్ల బాలుడిని ఎత్తుకెళ్లి హతమార్చిన పులి

మహారాష్ట్రలోని చంద్రపూర్‌ జిల్లాలో పులుల దాడులు భయాందోళనలు కలిగిస్తున్నాయి. జిల్లాలోని సావ్లీ తాలూకా బోర్‌మాడ గ్రామంలో ఇంటి ముందు ఆడుకుంటున్న హర్షన్‌ కార్‌మంగే(4) అనే బాలుడిని పెద్దపులి నోటకర్చుకుని వెళ్లి హతమార్చిన ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది

Published : 31 Mar 2023 05:56 IST

హర్షన్‌ తల్లిని ఓదార్చుతున్న అటవీ అధికారులు

బల్లార్ష, న్యూస్‌టుడే : మహారాష్ట్రలోని చంద్రపూర్‌ జిల్లాలో పులుల దాడులు భయాందోళనలు కలిగిస్తున్నాయి. జిల్లాలోని సావ్లీ తాలూకా బోర్‌మాడ గ్రామంలో ఇంటి ముందు ఆడుకుంటున్న హర్షన్‌ కార్‌మంగే(4) అనే బాలుడిని పెద్దపులి నోటకర్చుకుని వెళ్లి హతమార్చిన ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. తల్లి చూస్తుండగానే ఈ దారుణం చోటుచేసుకోవడం గమనార్హం. తల్లి పెద్దగా కేకలు వేస్తూ పులి వెంటపడినా ఫలితం లేకుండాపోయింది. ఈ ఘటన బుధవారం సాయంత్రం జరగగా.. గ్రామస్థులు వెంటనే అటవీ అధికారులకు సమాచారమిచ్చారు. వారు గ్రామ సమీపంలోని అడవిలో గాలించారు. గురువారం ఉదయం అడవిలో బాలుడి శరీర భాగాలు కనిపించడంతో.. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తల్లి రోదనలు మిన్నంటాయి. పేద కుటుంబానికి చెందిన సంజీవ్‌-ప్రతీక్ష దంపతులకు హర్షన్‌ ఒక్కగానొక్క కుమారుడు కాగా.. సంజీవ్‌ గ్రామస్థులతో కలిసి తెలంగాణ రాష్ట్రంలో మిరపకాయల కోతల కూలీపనులకు వెళ్లాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు