వాతావరణం.. వ్యాధుల తరుణం
అధిక వేడి... పైగా వర్షం...ఇలా వాతావరణ మార్పులతో వైరల్ జ్వరాలు వస్తాయి. ముఖ్యంగా జలుబు, దగ్గు, జ్వరం, ఒళ్లు నొప్పులతో బాధపడుతుంటారు.
మేలో నిప్పులు కురిపించిన భానుడు జూన్‌లోకి వచ్చేసరికి కాస్త చల్లబడ్డాడు. వివిధ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 35-36 డిగ్రీలకు తగ్గాయి. వాతావరణంలో మార్పులు ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
* అధిక వేడి... పైగా వర్షం...ఇలా వాతావరణ మార్పులతో వైరల్ జ్వరాలు వస్తాయి. ముఖ్యంగా జలుబు, దగ్గు, జ్వరం, ఒళ్లు నొప్పులతో బాధపడుతుంటారు. వర్షంలో ఎక్కువ సేపు తడవటం మంచిది కాదు. తడిసినా వెంటనే పొడి టవల్‌తో తల శుభ్రంగా తుడుచుకోవాలి. జలుబు, దగ్గు, గొంతు నొప్పి ఉంటే ఆవిరి పట్టడం, గోరు వెచ్చటి నీటిలో చిటికెడు ఉప్పు వేసి పుకిలించడం చేయాలి. ఆయాసం, ఊపిరితీసుకోవడం కష్టమైనప్పుడు మాత్రం వెంటనే వైద్యులను సంప్రదించాలి.
* ఇంటి పరిసరాలు, సంపుల్లో నిల్వ నీటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. లేదంటే దోమల వృద్ధికి అనువుగా ఉంటాయి. డెంగీ జ్వరానికి కారణమైన దోమ పెరుగుతుంది. మురికి నీటిలో మలేరియా కలగజేసే ఆడ ఎనాఫిలిస్ దోమ లార్వా వృద్ధి చెందుతుంది. కొబ్బరి చిప్పలు, పూల కుండీలు, టైర్లు, ఖాళీ బకెట్లలో చేరిన వర్షపు నీటిని ఎప్పటికప్పుడు తొలగించాలి. లార్వాను నాశనం చేసే మలాథియాన్ లాంటి మందులను పిచికారీ చేయాలి.
* ఓ వైపు ఎండ మరోవైపు వాన కారణంగా గాలిలో తేమ శాతం పెరిగింది. దీంతో ఉక్కపోత అధికంగా ఉంటుంది. చెమట ఎక్కువగా ఉంటుంది. కాలి వేళ్ల మధ్య, గజ్జలు ఇతర ప్రాంతాల్లో ఫంగస్ చేరి తామర, ఇతర చర్మ వ్యాధులకు కారణమవుతుంది. వదులుగా ఉండే కాటన్ దుస్తులను ధరించాలి. చెమటకాయల నియంత్రణకు పౌడర్లు వినియోగించాలి.
ఈనాడు, హైదరాబాద్
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sreeleela: వాటి ఎంపికలో జాగ్రత్తగా ఉంటా.. ఆ జానర్‌పై ఇష్టం పెరిగింది: శ్రీలీల
-
TS News: తెలంగాణలో కొత్త రెవెన్యూ డివిజన్లు .. నేటి నుంచి అమల్లోకి
-
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
CM Bungalow: కేజ్రీవాల్ అధికారిక నివాసం వివాదం.. రంగంలోకి CBI
-
MK Stalin: ప్రజల పట్ల మర్యాదతో ప్రవర్తించండి.. ఉద్యోగులకు సీఎం స్టాలిన్ విజ్ఞప్తి
-
Asteroid : బెన్ను నమూనాల గుట్టు విప్పుతున్నారు.. అక్టోబరు 11న లైవ్ స్ట్రీమింగ్!