logo

పల్లెల్లో ప్రకృతి వనాలు

పల్లెపాలన సులభతరంగా మారింది. తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక కొత్త పంచాయతీల ఏర్పాటుతో అధికారులు అందుబాటులోకి రావడంతో ప్రజలకు ప్రయోజనకరంగా మారింది.

Published : 02 Jun 2023 04:05 IST

కొత్త పంచాయతీలతో ప్రయోజనం

న్యూస్‌టుడే, ఆదిలాబాద్‌ పట్టణం: పల్లెపాలన సులభతరంగా మారింది. తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక కొత్త పంచాయతీల ఏర్పాటుతో అధికారులు అందుబాటులోకి రావడంతో ప్రజలకు ప్రయోజనకరంగా మారింది. ప్రతి పంచాయతీకి మౌలిక వసతుల కల్పనకు నిధులు రావడంతో వాటిని సద్వినియోగం చేసుకోవడంతో గ్రామాల రూపురేఖలు మారిపోయాయి. ప్రజల ఇక్కట్లను దూరం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అవసరమున్న ప్రతి చోట కొత్త పంచాయతీలను నెలకొల్పింది. గిరిజనులు అధికంగా ఉన్న ఆదిలాబాద్‌లో ఆదివాసీగూడేలు, గిరిజన తండాల్లో జనాభా తక్కువగా ఉన్నా వెసులుబాటు కల్పించింది. ఆదిలాబాద్‌ జిల్లా భీంపూర్‌ మండలం గొల్లఘాట్‌లో 227 మంది ఉన్నా అక్కడి అవసరాల రీత్యా గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసింది. తక్కువ జనాభాతో రూపుదిద్దుకున్న పంచాయతీలు వందల్లోనే ఉన్నాయి. ప్రతి పంచాయతీకి కార్యదర్శిని నియమించడంతో అధికారులు అందుబాటులోకి వచ్చారు. ప్రజలు తమ సమస్యలు చెప్పుకొనే వీలు సులువైంది.

వారెవ్వా వైకుంఠ ధామాలు

గతంలో ఏ పల్లెకు వెళ్లినా అధ్వాన పరిస్థితులు కనిపించేవి. తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడంతో ఏ గ్రామానికి వెళ్లినా ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తోంది. ప్రతి గ్రామంలో ఉద్యానవనాల ఏర్పాటు, రహదారుల పక్కల మొక్కలు నాటి పెంచడంతో పచ్చదనం పరిఢవిల్లుతోంది. ప్రతి గ్రామంలో శ్మశానవాటికలకు ప్రత్యేక స్థలాలు సేకరించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ప్రతిచోట దహన సంస్కారాల కోసం షెడ్లు నిర్మించి అక్కడ మొక్కలు పెంచి అందమైన వాతావరణం కనిపించేలా చేయడంతో వైకుంఠధామాలు కొత్త శోభను సంతరించుకున్నాయి.


నెరవేరని ఆకాంక్షలు..

కొత్త పంచాయతీల్లో ఇప్పటికి సొంత భవనాలు లేక ఆదాయ వనరులు లేక ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ట్రాక్లర్లు, ట్రాలీ, ట్యాంకర్లు కొనుగోలు చేయడంతో వాటి కిస్తీలు కట్టడం సైతం చిన్న పంచాయతీలకు భారంగా మారింది. స్థలాలు లేక క్రీడా మైదానాల లక్ష్యం పూర్తి కాలేదు. తడిపొడి చెత్తతో ఎరువుల తయారీ కొన్ని పంచాయతీలకే పరిమితమైంది. బృహత్‌ పల్లె ప్రకృతివనాలకు స్థలాలు దొరకక ఉమ్మడి జిల్లాలో వాటి సంఖ్య 50 కూడా దాటలేదు.


కోతలు లేని విద్యుత్తు సరఫరాకు చర్యలు

కరెంట్‌ ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నుంచి కోతలు లేని విద్యుత్తు సరఫరాకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్ర విభజన తరువాత తెలంగాణ సర్కారు అన్నిరంగాలకు అవసరమైన కరెంటుపై ప్రత్యేక దృష్టి పెట్టింది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని