రైతు బంధువై!
అన్నదాతలకు అండగా నిలిచేందుకు తెలంగాణ సర్కారు రైతు బంధు, రైతు బీమా పథకాలను ప్రవేశపెట్టింది.
న్యూస్‌టుడే, ఆదిలాబాద్ వ్యవసాయం : అన్నదాతలకు అండగా నిలిచేందుకు తెలంగాణ సర్కారు రైతు బంధు, రైతు బీమా పథకాలను ప్రవేశపెట్టింది. ఉమ్మడి జిల్లాలో ఆరు లక్షల మంది రైతులు 17.50 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారు. రైతుబంధు పథకం ప్రారంభంలో 4.96 లక్షల మంది రైతులుంటే ఇప్పుడు పెట్టుబడి సాయాన్ని 5.79 లక్షల మంది రైతులు లబ్ధి పొందుతున్నారు. వానాకాలం, యాసంగి పంటలకు ఎకరానికి రూ.5వేల చొప్పున నగదు జమ చేసేందుకు ప్రతి ఏటా రూ.2,145 కోట్లు కేటాయిస్తోంది. రైతు బీమా కోసం ఏటా రూ.125 కోట్ల ప్రీమియాన్ని చెల్లిస్తోంది. రైతులు ఏ కారణంతో చనిపోయినా రూ.5 లక్షలు పరిహారం వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లా మొత్తంలో రెండు వేల కుటుంబాలకు పైగా పరిహారం అందించారు. రైతుబంధు, రైతు బీమాతో పాటు రైతువేదికల నిర్మాణం, రైతు సమన్వయ సమితిల ఏర్పాటు, రైతులకు సాగు సలహాలు అందించేందుకు వీలుగా క్లస్టర్లు ఏర్పాటు చేయడం, మండల వ్యవసాయ విస్తరణ అధికారులను నియమించడం, మద్దతు ధరతో పంట ఉత్పత్తులను కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టింది. ముఖ్యమంత్రి జిల్లాకు వ్యవసాయ కళాశాలను మంజూరు చేశారు.
సాగు నీటికి ప్రాధాన్యం
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ప్రభుత్వం సాగు నీటి రంగానికి ప్రాధాన్యం ఇచ్చింది. ఉమ్మడి జిల్లాలో ఏళ్ల తరబడి అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయడంతోపాటు కొత్త ప్రాజెక్టుల నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది.
కొత్త ప్రాజెక్టులు
* పెన్‌గంగ ప్రాజెక్టుకు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మోక్షం లభించింది. ఆదిలాబాద్, మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న పెన్‌గంగపై రూ.1,596 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించింది. బ్యారేజీ పనులు 85 శాతం పూర్తి కాగా, పంపుహౌజ్ నిర్మాణం, ప్రధాన కాలువ పనులు చివరి దశలో ఉన్నాయి.
* నేరడిగొండ మండలంలో ప్రతిపాదనలో ఉన్న కుప్టి ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలపడంతో పాటు రూ.794.33 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
* చెన్నూర్ ఎత్తిపోతల పథకానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందుకు గాను రూ.1,658 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వార్దా నదిపై నిర్మించతలపెట్టిన ప్రాజెక్టు పూర్తికి రూ.4,500 కోట్ల వ్యయంతో అంచనాలు రూపొందించారు. దీని ద్వారా 1.44 లక్షల ఎకరాలకు సాగు నీరందే అవకాశం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Rahul Gandhi: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌దే పైచేయి..! తెలంగాణలో భాజపాపై రాహుల్ కీలక వ్యాఖ్యలు
-
Canada: నిజ్జర్ హత్యపై అమెరికా నుంచే కెనడాకు కీలక సమాచారం..!
-
Vande Bharat: ప్రయాణికుల సూచనలతో.. వందే భారత్ కోచ్‌లలో సరికొత్త ఫీచర్లు
-
Video: పరిణీతి-రాఘవ్ పెళ్లి సంగీత్.. సీఎంలు కేజ్రీవాల్, మాన్ సందడి
-
Chandrababu Arrest: రాజమహేంద్రవరం చేరుకున్న కార్ల ర్యాలీ
-
Kishan Reddy: ఉద్యోగాలు భర్తీ చేయకుండా కేసీఆర్ కుట్ర: కిషన్‌రెడ్డి