logo

పేదలకు ఊరట.. సంక్షేమానికి బాసట

తెలంగాణ ఏర్పాటు అనంతరం నిరుపేదలకు గౌరవ జీవనం అందించే పథకాలు సర్కారు అమలు చేస్తోంది.

Published : 02 Jun 2023 04:05 IST

న్యూస్‌టుడే, ఆదిలాబాద్‌ పాలనాప్రాంగణం: తెలంగాణ ఏర్పాటు అనంతరం నిరుపేదలకు గౌరవ జీవనం అందించే పథకాలు సర్కారు అమలు చేస్తోంది. ఇదివరకటి పింఛను మొత్తాలను గణనీయంగా పెంచడంతోపాటు వివిధవర్గాలకు అండగా నిలిచేకొత్త పథకాలను రూపొందించి అమలు చేస్తోంది.


దళితబస్తీ ప్రయోజనమిది..

ఉమ్మడి జిల్లాలో దళితబస్తీ కింద గడిచిన తొమ్మిదేళ్లలో లబ్ధి పొందిన కుటుంబాలు, పంపిణీ చేసిన భూమి, ప్రభుత్వం వెచ్చించిన వ్యయం వివరాలు జిల్లాల వారీగా..


నాడు డ్రైవర్‌.. నేడు ఓనర్‌!  

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న దళితబంధుతో సగం జీవితం మరొకరి వద్ద డ్రైవరుగా పనిచేసిన నేను ఇపుడు ట్రాక్టర్‌ యజమానిగా మారాను. అందుకు ప్రభుత్వం రూ.10 లక్షలు మంజూరు చేయడం మాటల్లో చెప్పలేని సంతోషాన్ని ఇచ్చింది. గడిచిన తొమ్మిది నెలల్లో రూ.డీజిల్‌ ఖర్చులు పోనూ రూ.2 లక్షల ఆదాయం వచ్చింది. సీఎం కేసీఆర్‌ చలువతో ఇది సాధ్యమైంది.

మద్దెల రాజు, దళితబంధు లబ్ధిదారు, బోథ్‌


ఆడ బిడ్డలకు అండగా..

కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలతో ఆడపిల్లల పెళ్లిళ్లకు ప్రభుత్వం ఆర్థికసాయం అందించడం పేద, మధ్య తరగతి కుటుంబాలకు అండనిస్తోంది. తెలంగాణ వచ్చాక ప్రభుత్వం ఈ పథకం అమలు చేయడంతో తల్లిదండ్రులపై కొంత ఆర్థిక భారం తగ్గినట్లయింది. తొలుత రూ.51 వేలతో ఆ తర్వాత రూ.75,116 చెల్లించిన ప్రభుత్వం 2018 మార్చి నుంచి ఆ సాయాన్ని రూ.1,00,116కు పెంచింది. వేలాది మంది 2014 నుంచి ఇప్పటి వరకు లబ్ధి పొందుతూ వస్తున్నారు.


పండుటాకులకు ఎంతో ‘ఆసరా’

రూ.200 ఉన్న వృద్ధాప్య, వితంతు, బీడీ, చేనేత కార్మికుల పింఛను తొలుత రూ.వెయ్యికి పెంచిన సర్కారు 2018 నుంచి మరో వెయ్యి పెంచి రూ.2,016గా చేసింది. దివ్యాంగులకు రూ.500 నుంచి రూ.1,500 ఆతర్వాత రూ.3,016 పెంచింది. వయసును 57 ఏళ్లకు కుదించడంతో వేలాదిమంది మేలు చేకూరింది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 3,62,721 మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరిలో అత్యధికంగా 1,13,941 మంది వృద్ధాప్య పింఛనుదారులు ఉంటే.. వితంతువులు 1,26,669 మంది ఉన్నారు. అన్ని రకాల పింఛనుదారులకు నెలకు దాదాపు రూ.40 కోట్లకు పైగా సర్కారు చెల్లిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని