logo

అంతర్జాతీయ సైన్స్‌ఫేర్‌కు జిల్లా విద్యార్థులు

విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందిస్తూ నూతన ఆవిష్కరణలను ప్రోత్సహిస్తున్న ఇన్నోవేషన్‌ ఫౌండేషన్‌ ఇన్‌స్పైర్‌ జాతీయ స్థాయి మేళాలో జిల్లా నుంచి పాల్గొన్న పలువురు విద్యార్థులకు అంతర్జాతీయ సైన్స్‌ ఫేర్‌లో పాల్గొనే అరుదైన గౌరవం దక్కింది.

Published : 03 Jun 2023 02:15 IST

మంచిర్యాల విద్యావిభాగం, కాసిపేట, ఆదిలాబాద్‌ పాలనాప్రాంగణం న్యూస్‌టుడే: విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందిస్తూ నూతన ఆవిష్కరణలను ప్రోత్సహిస్తున్న ఇన్నోవేషన్‌ ఫౌండేషన్‌ ఇన్‌స్పైర్‌ జాతీయ స్థాయి మేళాలో జిల్లా నుంచి పాల్గొన్న పలువురు విద్యార్థులకు అంతర్జాతీయ సైన్స్‌ ఫేర్‌లో పాల్గొనే అరుదైన గౌరవం దక్కింది. విద్యార్థుల ఆవిష్కరణలకు ఆకర్షితులై జపాన్‌ ప్రభుత్వం సకుర సైన్స్‌ హై స్కూల్‌ ప్రోగ్రాం అనే కార్యక్రమం ద్వారా వారి దేశ సందర్శనకు అవకాశం కల్పించింది. రాష్ట్ర వ్యాప్తంగా 18 మందికి ఈ అవకాశం దక్కగా మంచిర్యాల నుంచి ముగ్గురు, సిరికొండ మండలం నుంచి ఒకరు ఉన్నారు. జిల్లాలోని మల్కేపల్లి ప్రభుత్వ ఆశ్రమ ఉన్నత పాఠశాలకు చెందిన జుమిడ్మి అంజన్న, జËడ్పీహెచ్‌ఎస్‌ నెన్నెలకు చెందిన కేసరి నవీన్‌కుమార్‌, మంచిర్యాల శ్రీచైతన్య ఉన్నత పాఠశాలకు చెందిన సాయిలు సాయిశ్రీవల్లి ఈ పర్యటనకు ఎంపికయ్యారు. ఇందులో ఇద్దరు విద్యార్థులు ఇంటర్‌ పూర్తికాగా ఒకరు 9వ తరగతి చదువుతున్నారు. జిల్లా విద్యార్థులు ఈ ఘనత సాధించడంపై డీఈవో ఎస్‌.యాదయ్య, సైన్సు అధికారి మధుబాబులు సంతోషం వ్యక్తం చేస్తూ అభినందించారు. సిరికొండ మండలం పొన్న ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థి డొబ్లే రుషికేష్‌ జపాన్‌లో జరిగే అంతర్జాతీయ సైన్సు ఫేర్‌కు ఎంపికైనట్లు జిల్లా సైన్సు అధికారి రఘురమణ తెలిపారు. సదరు విద్యార్థి కిందటి విద్యా సంవత్సరంలో ఇన్‌స్పైర్‌ జాతీయస్థాయి పురస్కారానికి ఎంపికైన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని