logo

రక్షణ వ్యవస్థలో మనమే ముందున్నాం

ప్రజా రక్షణ వ్యవస్థలో మన రాష్ట్రమే ముందుందని, దీనికి కారణం పోలీసు వ్యవస్థలో ప్రభుత్వం చేపట్టిన మార్పులు, సౌకర్యాలే కారణమని ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు.

Updated : 07 Jun 2023 03:37 IST

పోలీసు శకటాల ర్యాలీని జెండా ఊపి ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే రామన్న, చిత్రంలో ఎమ్మెల్యే బాపురావు, కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌, శిక్షణ కలెక్టర్‌ శ్రీజ, తదితరులు

ఆదిలాబాద్‌ నేర విభాగం, న్యూస్‌టుడే : ప్రజా రక్షణ వ్యవస్థలో మన రాష్ట్రమే ముందుందని, దీనికి కారణం పోలీసు వ్యవస్థలో ప్రభుత్వం చేపట్టిన మార్పులు, సౌకర్యాలే కారణమని ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు. ‘తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల’లో భాగంగా మంగళవారం జిల్లా కేంద్రంలో సురక్షా దినోత్సవం నిర్వహించారు. ఎమ్మెల్యేలు రామన్న, బాపురావు, కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌, శిక్షణ కలెక్టర్‌ శ్రీజ, ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి పోలీసు పరేడ్‌ గ్రౌండ్‌ వద్ద ఉదయం 9 గంటలకు బేలూన్లు ఎగురేసి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.  డయల్‌-100, బ్లూకోర్టు, పెట్రోకార్‌, క్లూస్‌టీం, డాÞ్స్క్వాడ్‌, రిసెప్షన్‌, ఫ్యామిలీ కౌన్సెలింగ్‌, సీసీ టీఎన్‌ఎస్‌, సైబర్‌క్రైం, కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రం, షీటీం, కమ్యూనిటీ పోలీసింగ్‌, ట్రాఫిక్‌ అంశాలకు సంబంధించిన శకటాలు, అగ్నిమాపక శకటం, ద్విచక్ర వాహనాల భారీ ర్యాలీని ఎమ్మెల్యే జోగు రామన్న జెండా ఊపి ప్రారంభించారు. ఎమ్మెల్యే రాఠోడ్‌ బాపూరావు మాట్లాడుతూ మన పోలీసుల పని తీరుకు దేశంలోనే ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ మాట్లాడుతూ పోలీసులు అమలు చేస్తున్న స్నేహపూర్వక పోలీసింగ్‌ కారణంగానే నేరాలు తగ్గుముఖం పట్టాయన్నారు. పోలీసులు అందిస్తున్న సేవలపై ప్రజలకు అవగాహన కల్పించటానికే ఈ కార్యక్రమాన్ని చేపట్టామని, విజయవంతం చేసిన అధికారులు, పోలీసులకు ఎస్పీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అదనపు ఎస్పీ శ్రీనివాసరావు, డీఎస్పీ వి.ఉమేందర్‌, సీఐలు తదితరులు పాల్గొన్నారు.

సీసీఎస్‌ కానిస్టేబుల్‌ మహ్మద్‌ ఇసాక్‌కు ఉత్కృష్ఠ సేవా పతకం అందిస్తున్న ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి

పరేడ్‌ మైదానంలో సంబరాలు..

ఆదిలాబాద్‌ పోలీస్‌ పరేడ్‌ మైదానంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి సురక్ష దివస్‌ సంబరాలు నిర్వహించారు. జడ్పీ ఛైర్మన్‌ జనార్దన్‌ రాఠోడ్‌, ఎమ్మెల్యే రామన్న, కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌, ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు. విధుల్లో ప్రతిభ కనబరిచిన పోలీసులకు సేవాపతకాలు అందించారు. చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో ఎస్పీ అధికారులను పట్టించుకోలేదని కొందరు ఆవేదన వ్యక్తం చేశారు.

పట్టణంలో పోలీసు శకటాల ర్యాలీ

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని