రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటన కుమురంభీం జిల్లా వాంకిడి మండలంలోని గణేష్‌పూర్ సమీపంలోని జాతీయ రహదారిపై ఆదివారం అర్ధరాత్రి జరిగింది.
వాంకిడి : రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటన కుమురంభీం జిల్లా వాంకిడి మండలంలోని గణేష్‌పూర్ సమీపంలోని జాతీయ రహదారిపై ఆదివారం అర్ధరాత్రి జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కుమురం భీం జిల్లాలోని దయగాం మండలకేంద్రానికి చెందిన నాగుల తిరుపతి(50), నాగేశ్(45)లు మహారాష్ట్రలోని చంద్రాపూర్‌లో తమ బంధువుల ఇంట్లో జరిగిన శుభకార్యానికి వెళ్లి కారులో తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో కొమరంభీం జిల్లా వాంకిడి మండలంలోని గణేష్‌పూర్ సమీపంలోకి రాగానే వీరు ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వస్తున్న లారీ అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తిరుపతి అక్కడికక్కడే మృతి చెందాడు. గమనించిన స్థానికులు నాగేశ్‌ను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందగా.. కారు ప్రయాణిస్తున్న మరో మహిళ స్వల్పంగా గాయపడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
భారత్‌కు తిరిగి రానున్న శివాజీ ‘పులి గోళ్లు’!
-
‘సీఎం ఇంటికి కూతవేటు దూరంలోనే స్కిల్ డెవలప్మెంట్ కేంద్రం’
-
కన్నవారి నడుమ కుదరని ఏకాభిప్రాయం.. మూడేళ్ల చిన్నారికి పేరు పెట్టిన హైకోర్టు
-
Chandrababu: జైలులో నేడు చంద్రబాబు దీక్ష
-
తిరుమలలో బ్రేక్ దర్శనం, గదుల బుకింగ్‌కు ‘పే లింక్’ సందేశాలతో నగదు చెల్లింపు!
-
విశాఖలో పిడుగు పాటు.. వీడియో వైరల్