logo

సాంకేతిక గణనాథ

గణనాథుడు కొలువుదీరిన మండపాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.

Updated : 22 Sep 2023 06:12 IST

ప్రతి మండపంపై పోలీసుల నిఘా

మండపాలను ఆన్‌లైన్‌లో పొందుపరుస్తున్న పోలీసు అధికారి

మంచిర్యాలనేరవిభాగం, న్యూస్‌టుడే: గణనాథుడు కొలువుదీరిన మండపాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని ప్రతి మండపం తమ ఆధీనంలో ఉండేలా ప్రత్యేక సాంకేతికతను జోడిస్తూ విగ్రహాలకు జియో ట్యాగింగ్‌ అనుసంధానం చేశారు. ఇప్పటికే ఈ ప్రక్రియ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పూర్తికాగా ఈ ఏడాది ప్రతిష్ఠించిన 6,180 మండపాలపై పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచారు.

ముందస్తు ప్రణాళికతో..

వినాయక నవరాత్రుల సందర్భంగా పోలీసులు ముందు నుంచి ప్రణాళిక ప్రకారం సాగుతున్నారు. మండపాలు ఏర్పాటు చేసుకోవడానికి నిర్వాహకులు తప్పకుండా ముందస్తుగా అనుమతి తీసుకోవాలని సూచించారు. ఆన్‌లైన్‌లో కూడా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఇందుకోసం ప్రత్యేక పోర్టల్‌ (policeportal.tspolice.gov.in) ను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఠాణాలవారీగా వచ్చిన దరఖాస్తులు పరిశీలించి గతంలో ఎలాంటి ఘటనలకు దారి తీయని మండపాలకు అనుమతులు ఇచ్చారు.

మ్యాప్‌లో జియోట్యాగింగ్‌ చేసిన మండపం ఇలా..

జియోట్యాగింగ్‌ ఇలా...

బ్లూకోల్ట్స్‌ సిబ్బంది వద్ద ట్యాబ్‌లున్నాయి. పట్టణాలు, గ్రామాల్లోని గణపతి మండపాలను పరిశీలించి కమిటీల నిర్వాహకుల పూర్తి వివరాలు రాసుకున్నారు. ఆ తర్వాత ట్యాబ్‌లో గణపయ్య మండపం ఫొటో తీసి ఆన్‌లైన్‌ ద్వారా జియోట్యాగింగ్‌ చేశారు. అందులోని లొకేషన్‌ ఆప్షన్‌ను నొక్కగానే వెంటనే మండపం ఏర్పాటు చేసిన ప్రాంతం తెలుస్తుంది. నిమజ్జనం ఏ రోజు, ఎక్కడ చేస్తారనే వివరాలను పొందుపరిచారు. టీఎస్‌కాప్‌ అప్లికేషన్‌లో ఎప్పటికప్పుడు బ్లూకోల్ట్స్‌, పెట్రోలింగ్‌ సిబ్బంది మండపాల దగ్గరికి వెళ్తున్నారో లేదో అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని