logo

ఈ నెల 23న తల్లిదండ్రుల సమావేశాలు నిర్వహించాలి

జిల్లాలోని  అన్ని  ప్రభుత్వ యాజమాన్య  విద్యాలయాల్లో  ఈ నెల 23న తల్లిదండ్రులు, పోషకుల సమావేశాలు నిర్వహించాలని జిల్లా విద్యాధికారి రవీందర్ రెడ్డి తెలిపారు.

Published : 22 Sep 2023 13:30 IST

                          
నిర్మల్‌ అర్బన్  : జిల్లాలోని  అన్ని  ప్రభుత్వ యాజమాన్య  విద్యాలయాల్లో  ఈ నెల 23న తల్లిదండ్రులు, పోషకుల సమావేశాలు నిర్వహించాలని జిల్లా విద్యాధికారి రవీందర్ రెడ్డి తెలిపారు. ఈ సమావేశాలకు  వారు తప్పక  హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థుల ప్రగతి, పాఠశాలలో చేపడుతున్న  కార్యక్రమాలు, అభివృద్ధిలో వారు భాగస్వాములు అయ్యేలా, తదితర విషయాలపై చర్చించాలని పేర్కొన్నారు. మండల విద్యాధికారులు, జిల్లా కోఆర్డినేటర్లు, కాంప్లెక్స్, పాఠశాలల  ప్రధానోపాధ్యాయులు ఈ  విషయంలో ప్రత్యేక చొరవ చూపాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని