logo

ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఫీజు దీక్ష

విద్యార్థులకు సంబంధించిన ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) జిల్లా కార్యదర్శి శీతల్కర్ అరవింద్  అన్నారు.

Updated : 22 Sep 2023 16:13 IST

నిర్మల్ అర్బన్: విద్యార్థులకు సంబంధించిన ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) జిల్లా కార్యదర్శి శీతల్కర్ అరవింద్  అన్నారు. శుక్రవారం నిర్మల్‌లోని సంఘం కార్యాలయంలో  ఫీజు దీక్ష చేపట్టి మాట్లాడారు. పెండింగ్‌లో ఉన్న వాటిని  ప్రభుత్వం వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. సకాలంలో అందక విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో  సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పరమేశ్వర్, కమిటీ సభ్యులు రుద్ర ప్రతాప్, ఉదయ్, రాజు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని