logo

అలరించిన సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు

నిర్మల్ జిల్లా తానూరు మండలంలోని బోసి గ్రామంలో కొలువుదీరిన శ్రీ వరసిద్ధి కర్ర వినాయకుడి దర్శనానికి జిల్లాలోని మండలాల నుంచే కాకుండా మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.

Updated : 22 Sep 2023 16:14 IST

తానూరు: నిర్మల్ జిల్లా తానూరు మండలంలోని బోసి గ్రామంలో కొలువుదీరిన శ్రీ వరసిద్ధి కర్ర వినాయకుడి దర్శనానికి జిల్లాలోని మండలాల నుంచే కాకుండా మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. తమ కోరికలు తీర్చాలని ముడుపులు కట్టి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. దర్శనానికి వచ్చిన భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేపట్టి తీర్థ ప్రసాదాలను అందజేశారు. గురువారం రాత్రి బోసి గ్రామానికి చెందిన గాడే శ్రావణి బృంద సభ్యులు చేసిన సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు పలువురిని విశేషంగా ఆకట్టుకున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని