logo

బకాయిలు వెంటనే విడుదల చేయాలి

మధ్యాహ్న భోజన కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ (ఏఐటీయూసీ ) జిల్లా అధ్యక్షుడు బుక్య రమేష్ అన్నారు.

Updated : 22 Sep 2023 17:06 IST

నిర్మల్ అర్బన్: మధ్యాహ్న భోజన కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ (ఏఐటీయూసీ ) జిల్లా అధ్యక్షుడు బుక్య రమేష్ అన్నారు. నిర్మల్ ఆర్డీవో కార్యాలయం ఎదుట నిర్వహిస్తున్న సమ్మెలో భాగంగా శుక్రవారం మధ్యాహ్నం  శిబిరం నుంచి ఎన్టీఆర్ మినీ ట్యాంక్ బండ్ వరకు ర్యాలీ చేపట్టి అంబేడ్కర్ చౌక్‌లో రహదారిపై రాస్తారోకో నిర్వహించి మాట్లాడారు. బకాయిలు వెంటనే విడుదల చేయాలన్న తదితర న్యాయమైన డిమాండ్లు  తీర్చాలని పేర్కొన్నారు.  అనంతరం డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు అమృత, పావని, ఉమ, మోనవ్వ, లక్ష్మీ, సాయవ్వ, కవిత తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని