logo

Andhra News: ఉద్యోగం చేయాలని ఉందా.. లేదా?.. పిచ్చి వేషాలు వేస్తున్నావా..

ఇరవై ఏళ్లలో నేను ఓటమి ఎరుగను.. ఒకసారి ఓడినా, నాకేమీ కాదు. నువ్వో ఉద్యోగస్తుడివి అన్న సంగతి మర్చిపోవద్దు.. ఉద్యోగం చేయాలని ఉందా.. లేదా.. పిచ్చిపిచ్చి వేషాలు వేస్తున్నావా..  

Updated : 25 May 2022 07:54 IST

సచివాలయ ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌పై వైకాపా నేత మండిపాటు 

ఇరవై ఏళ్లలో నేను ఓటమి ఎరుగను..  ఒకసారి ఓడినా, నాకేమీ కాదు. నువ్వో ఉద్యోగస్తుడివి అన్న సంగతి మర్చిపోవద్దు.. ఉద్యోగం చేయాలని ఉందా.. లేదా.. పిచ్చిపిచ్చి వేషాలు వేస్తున్నావా..  

... సచివాలయ ఉద్యోగిపై ఓ వైకాపా నేత పత్రికలో రాయలేని విధంగా మాటలతో విరుచుకుపడ్డారు. 

అరకులోయ, న్యూస్‌టుడే: అసంపూర్తిగా నిలిపివేసిన భవన నిర్మాణం తిరిగి ప్రారంభించమన్నందుకు ఓ సచివాలయ ఉద్యోగిని వైకాపా నేత నోటికొచ్చినట్లు మాట్లాడారు.. దీనికి సంబంధించిన ఆడియో వైరల్‌ అవుతోంది. భీంపోల్‌ పంచాయతీలో రాజ్‌కుమార్‌ సచివాలయ ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఇదే పంచాయతీలో సగం నిర్మించి వదిలేసిన సచివాలయ భవనం పనులు ప్రారంభించాలని గుత్తేదారు, వైకాపా నాయకుడు, మాజీ సర్పంచి భర్త వీరమళ్ల ఈశ్వరరావుకు సెల్‌ఫోన్లో సందేశం పంపించారు. అసలు చేస్తారా.. చేయరా.. చెప్పాలన్నారు. ఈ సందేశాన్ని చూసిన ఆయన ఆగ్రహంతో ఊగిపోయారు. ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌కు ఫోన్‌ చేసి తిట్ల దండకం మొదలెట్టారు. మనిషికి గౌరవం ఇవ్వు, చిన్నపిల్లాడివి పిల్లాడిలా ఉండు.. బోడి ఉద్యోగాలు చేసి ఎవరిని బెదిరిస్తారు మీరు.. పక్కన వేరే భవనాలు కడుతున్న వారిని అడగవా? కుర్రోడివి రెచ్చిపోతున్నావు.. దెబ్బతింటే పుంజుకోలేవు అంటూ నోటికొచ్చినట్లు మాట్లాడారు. ఆయనను వారించేందుకు ప్రయత్నించినా లెక్కచేయలేదు. ఈ విషయమై ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ వద్ద ప్రస్తావించగా విధులలో భాగంగానే సందేశం పంపించానని అందుకు ఆయన అతిగా స్పందించినట్లు చెప్పారు. ఈ విషయమై ఇప్పటికే తన ఉన్నతాధికారుల దృష్టికి తెచ్చానన్నారు. ఉన్నతాధికారులకు ఆదేశాల మేరకు తదుపరి నిర్ణయం తీసుకుంటానన్నారు. అదేవిధంగా ఈశ్వరరావు వద్ద ప్రస్తావించగా తనకు అమర్యాదగా సందేశం పంపించినట్లు చెప్పారు. అందుకోసమే ఫోన్‌ చేసి ఆడిగానని అన్నారు. దీనిని కావాలనే రాద్ధాంతం చేస్తున్నారన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని