logo

ఆర్టీసీ ఛార్జీలు తగ్గించాల్సిందే: తెదేపా

పెంచిన ఆర్టీసీ ఛార్జీలను తక్షణమే తగ్గించాల్సిందేనని తెదేపా నాయకులు డిమాండ్‌ చేశారు. నిత్యావసర సరకుల ధరలు నియంత్రించాలన్నారు. ముంచంగిపుట్టు మండలం జర్జుల పంచాయతీ పెదతమింగుల గ్రామంలో శనివారం ర్యాలీ నిర్వహించారు.

Published : 03 Jul 2022 02:29 IST

హుకుంపేట సంతలో నినాదాలు చేస్తున్న మాజీమంత్రి శ్రావణ్‌కుమార్‌, నాయకులు

ముంచంగిపుట్టు, హుకుంపేట న్యూస్‌టుడే: పెంచిన ఆర్టీసీ ఛార్జీలను తక్షణమే తగ్గించాల్సిందేనని తెదేపా నాయకులు డిమాండ్‌ చేశారు. నిత్యావసర సరకుల ధరలు నియంత్రించాలన్నారు. ముంచంగిపుట్టు మండలం జర్జుల పంచాయతీ పెదతమింగుల గ్రామంలో శనివారం ర్యాలీ నిర్వహించారు. అరకులోయ నియోజకవర్గ తెదేపా ఇన్‌ఛార్జి కిడారి శ్రావణ్‌కుమార్‌ ర్యాలీలో పాల్గొని ప్రసంగించారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని ధరలు పెంచి సామాన్యులను అడ్డగోలుగా బాదుడు బాదుతోందని అన్నారు. గ్రామాల్లో సిమెంటు రోడ్లు, తాగునీరు. డ్రైనేజీ సదుపాయం కల్పించటంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. వైకాపా ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పోయిందని, పాదయాత్రలో ఇచ్చిన హామీలు అమలు చేయటంలో జగన్‌మోహన్‌రెడ్డి విఫలమయ్యారని ఆయన ఆరోపించారు. హుకుంపేట వారపు సంతలో మాజీ మంత్రి శ్రావణ్‌కుమార్‌ ఆధ్వర్యంలో తెదేపా నాయకులు రాస్తారోకో నిర్వహించారు. అనంతరం యూత్‌ కాంగ్రెస్‌ పార్టీ అరకువేలి మండల ప్రధాన కార్యదర్శి వంతాల డేవిడ్‌, ముంచంగిపుట్టు మండలానికి చెందిన పలువురికి కండువా కప్పి తెదేపాలోకి ఆహ్వానించారు. తెదేపా నాయకులు తులసీరావు, లక్ష్మణుడు, సూర్యకాంతం, సత్యవతి, కామేశ్వరరావు, శాస్త్రిబాబు, బాబ్జీ, సుబ్బారావు, సర్పంచులు పాండురంగస్వామి, లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని