logo

గిరి ప్రదక్షిణకు పక్కాగా ఏర్పాట్లు: కలెక్టర్‌

భక్తులకు అసౌకర్యం కలుగకుండా సింహగిరి ప్రదక్షిణకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్‌ ఎ.మల్లికార్జున అధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం కలెక్టరేట్‌ సమావేశమందిరంలో అధికారులతో నిర్వహించిన సమీక్షలో కలెక్టర్‌ మాట్లాడారు.

Published : 03 Jul 2022 02:29 IST

విశాఖపట్నం, న్యూస్‌టుడే: భక్తులకు అసౌకర్యం కలుగకుండా సింహగిరి ప్రదక్షిణకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్‌ ఎ.మల్లికార్జున అధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం కలెక్టరేట్‌ సమావేశమందిరంలో అధికారులతో నిర్వహించిన సమీక్షలో కలెక్టర్‌ మాట్లాడారు. ఈనెల 12న 35 కిలోమీటర్ల మేర జరిగే గిరి ప్రదక్షిణ మార్గంలో ప్రతి కిలోమీటరుకు ఒక స్టాలు ఏర్పాటు చేసి, అందులో కుర్చీలు, మంచినీరు, సంచార మూత్రశాలలు ఏర్పాటు చేయాలన్నారు. వాహనాల పార్కింగ్‌పై దేవస్థానం, పోలీసు అధికారులు సంయుక్తంగా పరిశీలించి అంచనాకు రావాలన్నారు. సరిపడా బస్సులను ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. నిరంతరం విద్యుత్తు సరఫరా ఉండాలన్నారు. డీసీపీ సుమిత్‌ సునీల్‌ మాట్లాడుతూ వాహన రాకపోకలకు అంతరాయం కలగకుండా చూడాలన్నారు.  సమావేశంలో జీవీఎంసీ కమిషనర్‌ లక్ష్మీశ, ఆలయ స్థానాచార్యులు టి.రాజగోపాల్‌, డిప్యూటీ ఈఓ సుజాత, సహాయ కార్యనిర్వహణ అధికారులు తిరుమలేశ్వరరావు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు