logo

థాయిలాండ్‌ కరాటే టోర్నీకి చిట్టిబాబు

థాయిలాండ్‌ పుకెట్‌ నగరంలో ఆగస్టులో నిర్వహించనున్న థాయిలాండ్‌ ఓపెన్‌ కరాటే ఛాంపియన్‌ షిప్‌ - 2022 టోర్నీలో పాల్గొనేందుకు అరకులోయ మండలం ఇరగాయి పంచాయతీ సచివాలయ వీఆర్వో పాంగి చిట్టిబాబు ఎంపికయ్యారు.

Published : 03 Jul 2022 02:29 IST

సతీష్‌కుమార్‌ నుంచి ఎంపిక పత్రాన్ని అందుకుంటున్న చిట్టిబాబు

అరకులోయ పట్టణం, న్యూస్‌టుడే: థాయిలాండ్‌ పుకెట్‌ నగరంలో ఆగస్టులో నిర్వహించనున్న థాయిలాండ్‌ ఓపెన్‌ కరాటే ఛాంపియన్‌ షిప్‌ - 2022 టోర్నీలో పాల్గొనేందుకు అరకులోయ మండలం ఇరగాయి పంచాయతీ సచివాలయ వీఆర్వో పాంగి చిట్టిబాబు ఎంపికయ్యారు. ఆగస్టు 19నుంచి 23వ తేదీ వరకు జరుగనున్న ఈటోర్నీలో సీనియర్స్‌ బ్లాక్‌బెల్ట్‌ 55 కేజీల విభాగంలో పాల్గొననున్నాడు. ఎంపిక పత్రాన్ని శనివారం విశాఖలో సౌత్‌ ఇండియన్‌ వడోకాయ్‌ కరాటే అసోషియేషన్‌ అధ్యక్షులు సతీష్‌ కుమార్‌ చేతుల మీదుగా అందుకున్నాడు. మండలంలో లోతేరు పంచాయతీకి చెందిన చిట్టిబాబు ఇప్పటికే నవంబరులో నేపాల్‌ వేదికగా జరిగే ఒడొకాయ్‌ కరాటే అంతర్జాతీయ టోర్నీకి అర్హత సాధించగా తాజాగా థాయిలాండ్‌ టోర్నీకి అర్హత సాధించడం పట్ల లోతేరు, ఇరగాయి పంచాయతీ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

భవాని హాకీ క్రీడాకారులకు స్ఫూర్తి

అనకాపల్లి కలెక్టరేట్‌: హాకీ క్రీడాకారులు ఎలమంచిలి క్రీడాకారిణి భవానీని స్ఫూర్తిగా తీసుకోవాలని కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టి, జేసీ కల్పనాకుమారి పేర్కొన్నారు. అంతర్జాతీయ హాకీ పోటీలకు ఎంపికైన భవానిని శనివారం కలెక్టర్‌ కార్యాలయంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసింది. కలెక్టర్‌, జేసీ ఆమెను అభినందించి రూ. 15 వేల విలువైన హాకీ స్టిక్‌ను బహూకరించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ భవాని ఎలమంచిలి కీర్తిని అంతర్జాతీయ స్థాయికి తీసుకొని వెళ్లడం ప్రశంసనీయమన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని