logo

టెట్‌ పరీక్షకు అభ్యర్థుల పాట్లు

ఏపీ టెట్‌ పరీక్ష రాసేందుకు పాడేరు ఏజెన్సీ ప్రాంతానికి చెందిన గిరిజన అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శుక్రవారం విశాఖపట్నం, అనకాపల్లి, విజయవాడ తదితర ప్రాంతాలకు వెళ్లి పరీక్ష రాసేందుకు పాడేరు....

Published : 13 Aug 2022 01:48 IST


జీపులో వెళ్తున్న అభ్యర్థులు

పాడేరు పట్టణం, న్యూస్‌టుడే: ఏపీ టెట్‌ పరీక్ష రాసేందుకు పాడేరు ఏజెన్సీ ప్రాంతానికి చెందిన గిరిజన అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శుక్రవారం విశాఖపట్నం, అనకాపల్లి, విజయవాడ తదితర ప్రాంతాలకు వెళ్లి పరీక్ష రాసేందుకు పాడేరు నుంచి సరిపడా బస్సులు లేకపోవడంతో అభ్యర్థులు అష్టకష్టాలు పడ్డారు. మారుమూల ప్రాంతాల నుంచి పాడేరు చేరుకున్న అభ్యర్థులు బస్సులు లేక ప్రైవేటు వాహనాలను ఆశ్రయించారు. ఇదే అదునుగా జీపు డ్రైవర్లు టికెట్‌ ధరలు భారీగా పెంచేశారు. పాడేరు నుంచి చోడవరం వరకు రూ.100 ఉన్న టికెట్‌ను రూ.200 వరకు పెంచేశారు. దీనిపై పాడేరు ఎస్సై లక్ష్మణ్‌రావును ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా.. జీపు డ్రైవర్లతో మాట్లాడి ఛార్జీలు పెంచకుండా చూస్తామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని