logo

చంద్రయ్యపేటలో పులి సంచారం

నల్లకొండ అటవీ ప్రాంతాన్ని ఆవాసం చేసుకుని మూగజీవాలపై పెద్దపులి పంజా విసురుతోంది. చంద్రయ్యపేట సమీపంలో గురువారం రాత్రి సబ్బవరపు దేముడుకు చెందిన చూడి గేదెను పొట్టనపెట్టుకుంది.

Published : 13 Aug 2022 01:48 IST


నల్లకొండ అడవిలో తిరుగుతున్న పెద్దపులి

కె.కోటపాడు, న్యూస్‌టుడే: నల్లకొండ అటవీ ప్రాంతాన్ని ఆవాసం చేసుకుని మూగజీవాలపై పెద్దపులి పంజా విసురుతోంది. చంద్రయ్యపేట సమీపంలో గురువారం రాత్రి సబ్బవరపు దేముడుకు చెందిన చూడి గేదెను పొట్టనపెట్టుకుంది. వరుస ఘటనలతో చౌడువాడ, గరుగుబిల్లి, చింతపాలెం, ఆర్లి, చంద్రయ్యపేట గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికే చింతపాలెం, ఆర్లి, చౌడువాడ గ్రామాల్లో మూడు పాడి పశువులపై పులి దాడి చేసి హతమార్చింది. తాజాగా చంద్రయ్యపేటలో దాడి చేసింది. పులిని బంధించేందుకు అటవీ శాఖ అధికారులు గతంలో ఆర్లిలో, ఇటీవల చౌడువాడలో బోను ఏర్పాటు చేశారు. చింతపాలెంలో మంచె ఏర్పాటు చేసి మత్తు ఇంజక్షన్లు ఇచ్చి పట్టుకునేందుకు యత్నించగా పులి తప్పించుకుంది. చౌడువాడలో బోను వద్దకు వచ్చి అక్కడి నుంచి జారుకుంది. జులై 14 నుంచి ఇప్పటి వరకు కె.కోటపాడు మండలం నల్లకొండ, సబ్బవరం మండలం ఎల్లుప్పి తదితర అటవీ ప్రాంతాల్లోనే పులి సంచరిస్తోంది. ఆర్లి నుంచి చింతపాలెం మీదుగా చౌడువాడ వచ్చిన పులి వచ్చిన దారిలోనే వెనక్కు వెళ్లి చంద్రయ్యపేటలో పాడి పశువుపై దాడి చేసిందని పెందుర్తి అటవీ సెక్షన్‌ అధికారి రామారావు పేర్కొన్నారు. శుక్రవారం రాత్రికి చూడిగేదె మాంసం తినడానికి వస్తుందని భావించిన అధికారులు పులి కదలికలను గమనించేందుకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.


పులి దాడిలో హతమైన గేదె


Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని