logo

అల్లూరి పోరాటమే యువతకు స్ఫూర్తి: పీవో

పాడేరు ఐటీడీఏ పీవో రోణంకి గోపాలకృష్ణ ఎండ్రిక్‌ కొండపై జాతీయ జెండాను ఆవిష్కరించారు. పెదబయలు మండలం పులిగొంది గ్రామాన్ని శుక్రవారం ఉదయం ఆయన సందర్శించారు.

Published : 13 Aug 2022 01:48 IST


జెండాను ఆవిష్కరించిన సర్పంచి సోమెల రూతు

పెదబయలు గ్రామీణం, న్యూస్‌టుడే: పాడేరు ఐటీడీఏ పీవో రోణంకి గోపాలకృష్ణ ఎండ్రిక్‌ కొండపై జాతీయ జెండాను ఆవిష్కరించారు. పెదబయలు మండలం పులిగొంది గ్రామాన్ని శుక్రవారం ఉదయం ఆయన సందర్శించారు. జాతీయ జెండాను పట్టుకుని పులిగొంది నుంచి కాలినడకన వెళ్లి ఎండ్రిక్‌ పర్వతం పైకి చేరుకున్నారు. ఆజాదీకా అమృత్‌ మహోత్సం హర్‌ ఘర్‌ తిరంగాలో భాగంగా పర్వతంపై  జెండాను ఎగురవేసి వందనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రిటిష్‌ వారి దాస్యశృంఖలాల నుంచి స్వేచ్ఛావాయువులు పీల్చడానికి ఎందరో మహానుభావులు ప్రాణత్యాగాలు చేసి స్వాతంత్య్రాన్ని సంపాదించారని తెలిపారు. స్వాతంత్య్ర సమర యోధుడు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు, అయన అనుచరులు మల్లుదొర, గంటందొర పోరాట స్ఫూర్తిని గిరిజన యువత ఆదర్శంగా తీసుకోవాలని పేర్కొన్నారు. డీటీ కుమారస్వామి, గిరిజన సంక్షేమ శాఖ ఏఈ ధృవ, పులిగొంది గ్రామస్థులు పాల్గొన్నారు.

అనంతగిరి గ్రామీణం, న్యూస్‌టుడే: ప్రతి ఇంటికి జాతీయ జెండాను అందజేయాలని అనంతగిరి   సర్పంచి సోమెల రూతు అన్నారు. శుక్రవారం అనంతగిరి గ్రామ సచివాలయంలో జాతీయ జెండాను సర్పంచ్‌ చెతులు మీదుగా అవిష్కరించారు. గ్రామ కార్యదర్శి జోగరావు, రాజశేఖర్‌, మహిళా పోలీస్‌ సన్యాసమ్మ, వాలంటీర్లు సుమిత్ర మాణిఖ్యం, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.


ఎండ్రిక్‌ కొండపై పీఓ గోపాలకృష్ణ తదితరులు


Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts