logo

సందడిగా రాఖీ పండగ

రాఖీ పండగ పురస్కరించుకుని దుకాణాలు కిటకిటలాడాయి. శుక్రవారం తెల్లవారుజాము నుంచి దుకాణాల వద్ద మహిళలు, చిన్నారులు గుమిగూడి రాఖీలు కొనుగోలు చేశారు. స్థానిక ఒకేషనల్‌ కళాశాల విద్యార్థినులు ఉపాధ్యాయులు మండల కేంద్రంలోని ప్రతి దుకాణం వద్దకి వెళ్లి వ్యాపారులకు, ప్రయాణికులకు రాఖీలు కట్టి మిఠాయి పంపిణీ చేశారు.

Published : 13 Aug 2022 01:48 IST


అరకులోయ సీఐ దేముడుబాబుకు రాఖీ కడుతున్న బాలలు

హుకుంపేట, న్యూస్‌టుడే: రాఖీ పండగ పురస్కరించుకుని దుకాణాలు కిటకిటలాడాయి. శుక్రవారం తెల్లవారుజాము నుంచి దుకాణాల వద్ద మహిళలు, చిన్నారులు గుమిగూడి రాఖీలు కొనుగోలు చేశారు. స్థానిక ఒకేషనల్‌ కళాశాల విద్యార్థినులు ఉపాధ్యాయులు మండల కేంద్రంలోని ప్రతి దుకాణం వద్దకి వెళ్లి వ్యాపారులకు, ప్రయాణికులకు రాఖీలు కట్టి మిఠాయి పంపిణీ చేశారు.

అరకులోయ, అనంతగిరి గ్రామీణం, ముంచంగిపుట్టు: రక్షాబంధన్‌ వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. అరకులోయ భారతీయ విద్యాకేంద్రం పాఠశాల విద్యార్థులు సీఐ దేముడుబాబుకి రాఖీలు కట్టి తమ సోదరభావాన్ని చాటుకున్నారు. జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ సుభద్ర తన సోదరుడికి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. పలువురు సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులకు రాఖీ కట్టి మిఠాయిలు పంచిపెట్టారు. మండల వైకాపా అధ్యక్షులు మల్లికార్జున్‌, రమేష్‌ పాల్గొన్నారు.

చింతపల్లి, సీలేరు, మోతుగూడెం, రాజవొమ్మంగి, ఎటపాక, న్యూస్‌టుడే: లోయరు సీలేరు ప్రాజెక్టులోని పలు పాఠశాలల్లో బాలికలు బాలురకు రాఖీలు కట్టారు. డొంకరాయి డీఏవీ ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం వేణుగోపాలస్వామినాయుడు మాట్లాడుతూ అన్నాచెల్లెళ్ల అనుబంధం గొప్పదన్నారు.చింతపల్లి, సీలేరు, రాజవొమ్మంగి, ఎటపాకలో రక్షా బంధన్‌ సందడిగా జరుపుకొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని