logo

గట్టెక్కించే నాథుడెవరు?

వరరామచంద్రాపురం మండల ప్రజలకు పోలవరం ముంపు తర్వాత అతి పెద్ద సమస్య అన్నవరం వాగు దాటడం. ఈ వాగుపై వంతెన కోసం ప్రజలు మూడేళ్లుగా ఎదురుచూస్తూనే ఉన్నారు. అధికారులు, నాయకులు వచ్చి చూసి వెళ్తున్నారు కానీ ప్రయోజనం ఉండటం లేదు. పాత వంతెన పూర్తిగా శిథిలమవవగా.. కొత్త నిర్మాణం అసంపూర్తిగా నిలిచిపోయింది.

Published : 30 Sep 2022 00:53 IST

వాగు దాటేందుకు చంటి పిల్లలతో తల్లుల ఇబ్బందులు

వరరామచంద్రాపురం మండల ప్రజలకు పోలవరం ముంపు తర్వాత అతి పెద్ద సమస్య అన్నవరం వాగు దాటడం. ఈ వాగుపై వంతెన కోసం ప్రజలు మూడేళ్లుగా ఎదురుచూస్తూనే ఉన్నారు. అధికారులు, నాయకులు వచ్చి చూసి వెళ్తున్నారు కానీ ప్రయోజనం ఉండటం లేదు. పాత వంతెన పూర్తిగా శిథిలమవవగా.. కొత్త నిర్మాణం అసంపూర్తిగా నిలిచిపోయింది. పనుల్లో నాణ్యతా లోపంతో చిన్నపాటి వరదకే రెండుసార్లు గట్లు కొట్టుకుపోయాయి. అప్పటినుంచి విద్యార్థులు, ఉద్యోగులు, రోగులు, రైతులు, వ్యాపారులు ఇక్కడ వాగు దాటేందుకు ఇక్కట్లకు గురవుతున్నారు. మూడేళ్లగా ఈ మార్గంలో ఆర్టీసీ బస్సులు వెళ్లడం లేదంటే సమస్య అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వాగుపై వంతెన నిర్మాణాన్ని పూర్తిచేయాలని స్థానికులు కోరుతున్నారు.

శిథిలమైన పాత వంతెన, పక్కన అసంపూర్తి నిర్మాణం

- వరరామచంద్రాపురం, న్యూస్‌టుడే

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని