logo

‘వైకాపా పాలనలో రాష్ట్రం నాశనం’

వైకాపా పాలనలో రాష్ట్రం సర్వనాశనమైందని గిరిజన మోర్జా జాతీయ ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కోసూరి కాశీవిశ్వనాథ్‌ పేర్కొన్నారు. గురువారం పార్టీ మండలాధ్యక్షుడు శారపు పోతురాజు ఆధ్వర్యంలో మొల్లేరు, ఆర్డీపురం, జియ్యంపాలెం, జగ్గంపాలెం, సూరంపాలెం, కొత్తాడ పంచాయతీల్లో

Published : 30 Sep 2022 00:53 IST

తాజంగి ప్రజాపోరు యాత్రలో మాజీ ఎంపీ గీత

గంగవరం, న్యూస్‌టుడే: వైకాపా పాలనలో రాష్ట్రం సర్వనాశనమైందని గిరిజన మోర్జా జాతీయ ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కోసూరి కాశీవిశ్వనాథ్‌ పేర్కొన్నారు. గురువారం పార్టీ మండలాధ్యక్షుడు శారపు పోతురాజు ఆధ్వర్యంలో మొల్లేరు, ఆర్డీపురం, జియ్యంపాలెం, జగ్గంపాలెం, సూరంపాలెం, కొత్తాడ పంచాయతీల్లో భాజపా ప్రజా పోరు యాత్ర నిర్వహించారు. నాయకులు మాట్లాడుతూ వైకాపా, తెదేపా రెండూ కుటుంబ పార్టీలన్నారు. భాజపా మాత్రమే ప్రజల కోసం పనిచేస్తోందన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లిస్తోందని చెప్పారు. పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బుల్లికొండలుదొర, నాయకులు బి.వి.భారతి, కుంజం సత్యనారాయణమ్మ, రమేø్, సూర్యచంద్ర, నరమాల శ్రీను తదితరులు పాల్గొన్నారు.

చింతపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: మారుమూల గిరిజన గ్రామాల్లో ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తున్నామని అరకు మాజీ ఎంపీ, భాజపా నాయకురాలు కొత్తపల్లి గీత పేర్కొన్నారు. గురువారం ప్రజాపోరు యాత్రలో భాగంగా భాజపా మండల అధ్యక్షుడు జైతి ప్రభాకర్‌ ఆధ్వర్యంలో తాజంగి, పెదబరడ గ్రామాల్లో ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలను గిరిజనులకు వివరించారు. రాష్ట్రంలో ప్రజా సమస్యల పరిష్కరించడంలో వైకాపా ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. భాజపాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. నాయకులు కురుసా ఉమామహేశ్వరరావు, పాంగి రాజారావు, కూడా కృష్ణారావు, అప్పలరాజు, కదుల్ల శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని