logo

వ్యాన్‌ బోల్తా... ముగ్గురికి తీవ్ర గాయాలు

మాడుగుల - పాడేరు ఘాట్‌ రోడ్డులో వంట్లమామిడి - తాటిపర్తికి మధ్య వ్యాన్‌ బోల్తాపడిన ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. బుచ్చెయ్యపేట మండలం దిబ్బిడి గ్రామానికి చెందిన 12 మంది మహిళలు భవానీ మాలలు ధరించారు. పాడేరులోని మోదకొండమ్మ

Published : 30 Sep 2022 00:53 IST

మాడుగుల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న లక్ష్మి, నాగభూషణం, వెంకటలక్ష్మి

మాడుగుల, న్యూస్‌టుడే: మాడుగుల - పాడేరు ఘాట్‌ రోడ్డులో వంట్లమామిడి - తాటిపర్తికి మధ్య వ్యాన్‌ బోల్తాపడిన ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. బుచ్చెయ్యపేట మండలం దిబ్బిడి గ్రామానికి చెందిన 12 మంది మహిళలు భవానీ మాలలు ధరించారు. పాడేరులోని మోదకొండమ్మ దర్శనానికి గురువారం ఉదయం బొలెరో వ్యాన్‌లో బయలు దేరారు. పాడేరులో అమ్మవారి దర్శనం ముగించుకుని తమ గ్రామానికి తిరుగు ప్రయాణమయ్యారు. ఘాట్‌ రోడ్డు దిగుతుండగా వంట్లమామిడి -తాటిపర్తికి మధ్య వ్యాన్‌ ముందు టైరు పేలిపోయింది. దీంతో వ్యాన్‌ బోల్తా పడింది. ఈ సంఘటనలో కుర్రు లక్ష్మి, బోడి నాగభూషణం, గొంప వెంకట లక్ష్మిలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ముగ్గురికి మాడుగుల ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక వైద్యం చేశారు. మరింత మెరుగైన వైద్యం కోసం అనకాపల్లి ఎన్టీఆర్‌ ఆసుపత్రికి తరలిస్తునట్లు వైద్యులు లావణ్య, శ్రీలక్ష్మి తెలిపారు. మరో యువకుడు పెదిరెడ్ల సుబ్రహ్మణ్యంకు  స్వల్ప గాయమైంది ఆయనకు ప్రథమ చికిత్స చేశారు. డ్రైవర్‌ పెద్దిరెడ్ల హనుమంతు మాట్లాడుతూ ఈ మధ్యనే వ్యాన్‌ కొన్నాను. టైర్లు నాలుగు కొత్తవే. ఎలా పేలిపోయిందో తెలియడం లేదన్నాడు. ఇతను క్షేమంగానే ఉన్నాడు. వ్యాన్‌ బోల్తా పడిన సంఘటనలో చెట్టు అడ్డుకోకపోతే తామంతా భారీ లోయలోకి పడి పోయే వారమని భవానీమాతలు ఆందోళన వ్యక్తం చేశారు. గాయపడిన వారందరిని 108 అంబులెన్స్‌లో మాడుగుల ఆసుపత్రికి సకాలంలో తీసుకుని వచ్చి వైద్యసేవలందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని