logo

చేయూతతో మహిళలకు స్వయం ఉపాధి

ప్రభుత్వం అందించే చేయూత పథకంతో మహిళలు స్వయం ఉపాధి పొందుతున్నారని ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి పేర్కొన్నారు. మూడోవిడత చేయూత చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని గురువారం స్థానిక కస్తూర్బా పాఠశాల ఆవరణలో నిర్వహించారు. ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి మాట్లాడుతూ మహిళల ఆర్థికాభివృద్ధికి

Published : 30 Sep 2022 00:53 IST

లబ్ధిదారులకు చెక్కు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి

కొయ్యూరు, న్యూస్‌టుడే: ప్రభుత్వం అందించే చేయూత పథకంతో మహిళలు స్వయం ఉపాధి పొందుతున్నారని ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి పేర్కొన్నారు. మూడోవిడత చేయూత చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని గురువారం స్థానిక కస్తూర్బా పాఠశాల ఆవరణలో నిర్వహించారు. ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి మాట్లాడుతూ మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. లబ్ధిదారులకు రూ.5.99 కోట్ల విలువైన చెక్కు పంపిణీ చేశారు. అనంతరం కొయ్యూరు పంచాయతీ చింతవానిపాలెంలో జోరువానలోనూ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికీ ఎమ్మెల్యే వెళ్లి పథకాలను వివరించారు. వైకాపా ప్రభుత్వాన్ని మళ్లీ ఆశీర్వదించాలని కోరారు. ఎంపీపీ రమేష్‌బాబు, జడ్పీటీసీ సభ్యులు నూకరాజు, బాలయ్య, కొప్పుల వెలమ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ నాగమణి, ఉప ఎంపీపీలు రమణ, నూకాలమ్మ, వైకాపా మండల అధ్యక్షుడు బాబులు, రాజులమ్మ, సర్పంచి సింహాచలం తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని