logo

భీంపోలు సర్పంచిపై విచారణ

మండలంలోని భీంపోలు సర్పంచి బిమాలమ్మపై గురువారం ఈఓపీఆర్డీ మల్లేశ్వరరావు పంచాయతీ కార్యాలయం వద్ద విచారణ చేపట్టారు. సర్పంచికి ముగ్గురు పిల్లల ఉన్నారని, ఈమె ఆ విషయాన్ని దాచిపెట్టి ఎన్నికల్లో పోటీ చేశారని భీంపోలు గ్రామానికి చెందిన కోనేపు ఈశ్వరమ్మ సబ్‌ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఆమె పోటీకి అనర్హురాలని,

Published : 30 Sep 2022 00:53 IST

ఏఎన్‌ఎం నుంచి వివరాలు సేకరిస్తున్న ఈఓపీఆర్డీ

అనంతగిరి, న్యూస్‌టుడే: మండలంలోని భీంపోలు సర్పంచి బిమాలమ్మపై గురువారం ఈఓపీఆర్డీ మల్లేశ్వరరావు పంచాయతీ కార్యాలయం వద్ద విచారణ చేపట్టారు. సర్పంచికి ముగ్గురు పిల్లల ఉన్నారని, ఈమె ఆ విషయాన్ని దాచిపెట్టి ఎన్నికల్లో పోటీ చేశారని భీంపోలు గ్రామానికి చెందిన కోనేపు ఈశ్వరమ్మ సబ్‌ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఆమె పోటీకి అనర్హురాలని, ఎన్నిక చెల్లదని అందులో పేర్కొన్నారు. ఈ మేరకు సబ్‌ కలెక్టర్‌ కోర్టులో కేసు నడుస్తుండగా ఆయన ఆదేశాల మేరకు ఈఓపీఆర్డీ విచారణ చేశారు. ఈ సందర్భంగా స్థానిక ఏఎన్‌ఎం లక్ష్మి, అంగన్‌వాడీ కార్యకర్త గెమ్మెలి లక్ష్మి, పంచాయతీ, సచివాలయ కార్యదర్శులు రామస్వామి, ఈశ్వరరావులను ఆయన విచారించారు. ఆరోగ్య సిబ్బంది, అంగన్‌వాడీ కార్యర్తలు సర్పంచికి ముగ్గురు పిల్లలు ఉన్నట్లు ఆధారాలతో నివేదిక అందించినట్లుగా ఈఓపీఆర్డీ చెప్పారు. విచారణకు సంబంధించిన వివరాలను సబ్‌కలెక్టర్‌కు అందించనున్నట్లుగా తెలిపారు. ఎంపీటీసీ సభ్యుడు అశోక్‌, ఉప సర్పంచ్‌ అప్పలకొండ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని