logo

మాచ్‌ఖండ్‌లో మెరుగుపడిన విద్యుదుత్పత్తి

ఆంధ్రా - ఒడిశా రాష్ట్రాల ఉమ్మడి నిర్వహణలోని మాచ్‌ఖండ్‌ జలవిద్యుత్కేంద్రంలో విద్యుత్తు ఉత్పత్తి మెరుగుపడింది. మొత్తం ఆరు జనరేటర్లతో 120 మెగవాట్ల ఉత్పత్తి సామర్థ్యమున్న ఈ ప్రాజెక్టులో ప్రస్తుతం నాలుగు జనరేటర్లు వినియోగంలోకి వచ్చాయి. ప్రతి గంటకు 23 మెగవాట్ల ఉత్పత్తి సామర్థ్యమున్న నాలుగో

Published : 30 Sep 2022 01:43 IST

నాలుగో జనరేటరు మరమ్మతులు జరుపుతున్న సిబ్బంది

ముంచంగిపుట్టు గ్రామీణం, న్యూస్‌టుడే: ఆంధ్రా - ఒడిశా రాష్ట్రాల ఉమ్మడి నిర్వహణలోని మాచ్‌ఖండ్‌ జలవిద్యుత్కేంద్రంలో విద్యుత్తు ఉత్పత్తి మెరుగుపడింది. మొత్తం ఆరు జనరేటర్లతో 120 మెగవాట్ల ఉత్పత్తి సామర్థ్యమున్న ఈ ప్రాజెక్టులో ప్రస్తుతం నాలుగు జనరేటర్లు వినియోగంలోకి వచ్చాయి. ప్రతి గంటకు 23 మెగవాట్ల ఉత్పత్తి సామర్థ్యమున్న నాలుగో నంబరు జనరేటరు రోటర్‌లో సాంకేతిక లోపం తలెత్తి గత నెల ఏడో తేదీన నిలిపివేశారు. తాజాగా ఈ జనరేటర్‌ను సిబ్బంది, ఇంజినీర్లు మరమ్మతులు పూర్తి చేశారు. బుధవారం రాత్రి నుంచి వినియోగంలోకి తీసుకు వచ్చారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 2, 3, 4, 5 జనరేటర్ల సాయంతో గంటకు 70 మెగవాట్ల విద్యుత్తు ఉత్పత్తి జరుపుతున్నట్లు ప్రాజెక్టు వర్గాలు తెలిపాయి.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని