logo

జోలాపుట్‌ నుంచి నీటి విడుదల నిలిపివేత

ఆంధ్ర - ఒడిశా  రాష్ట్రాల ఉమ్మడి నిర్వహణలో ఉన్న మాచ్‌ఖండ్‌ జల విద్యుత్తు కేంద్రానికి ప్రధాన జలాశయమైన జోలాపుట్‌ నుంచి నీటి విడుదల ఆదివారం నుంచి నిలిపివేశారు. రెండు రోజులుగా మన్యంలో వర్షాలు కురుస్తున్నాయి.

Published : 03 Oct 2022 01:40 IST

ముంచంగిపుట్టు గ్రామీణం, న్యూస్‌టుడే: ఆంధ్ర - ఒడిశా  రాష్ట్రాల ఉమ్మడి నిర్వహణలో ఉన్న మాచ్‌ఖండ్‌ జల విద్యుత్తు కేంద్రానికి ప్రధాన జలాశయమైన జోలాపుట్‌ నుంచి నీటి విడుదల ఆదివారం నుంచి నిలిపివేశారు. రెండు రోజులుగా మన్యంలో వర్షాలు కురుస్తున్నాయి. 2,750 అడుగుల నీటి నిల్వ సామర్థ్యమున్న జోలాపుట్‌లో ప్రస్తుతం 2,735.55 అడుగుల మేర నీరుంది. జలాశయంలో నిల్వలు పెంచే ఉద్దేశంతో నీటి విడుదల నిలిపివేసినట్లు తెలిసింది. 120 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం ఉన్న మాచ్‌ఖండ్‌లో మొత్తం నాలుగు జనరేటర్ల సహాయంతో 73 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని